ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Anita : మహిళా నైపుణ్యానికి ప్రతీకలు ముగ్గులు

ABN, Publish Date - Jan 12 , 2025 | 04:19 AM

సంక్రాంతికి ధనుర్మాసంలో తెలుగు లోగిళ్లలో వాకిళ్ల ముందు తీర్చిదిద్దే ముగ్గులు మహిళల్లోని నైపుణ్యాన్ని, సమర్థతను ప్రతిబింబిస్తాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

  • ప్రతి ముగ్గులో అనేక దృక్కోణాలు: హోం మంత్రి అనిత

  • ఉత్సాహంగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

  • తమిళనాడుకు చెందిన భార్గవికి ప్రథమ బహుమతి

  • కడప, తూర్పు, పశ్చిమగోదావరి మహిళలకు ద్వితీయ స్థానం

విజయవాడ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి ధనుర్మాసంలో తెలుగు లోగిళ్లలో వాకిళ్ల ముందు తీర్చిదిద్దే ముగ్గులు మహిళల్లోని నైపుణ్యాన్ని, సమర్థతను ప్రతిబింబిస్తాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) రాష్ట్రస్థాయి ఫైనల్స్‌ శనివారం జరిగాయి. విజయవాడలో నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని బ్యాడ్మింటన్‌ కోర్టులో నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మహిళలు హాజరయ్యారు. కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. బహుమతి ప్రదానోత్సవానికి హోం మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అబ్బూరి రత్నలక్ష్మి, సూరపునేని ఉషారాణి వ్యవహరించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని తమిళనాడుకు చెందిన కె.భార్గవి గెలుచుకున్నారు. ఆమెకు రూ.30 వేల బహుమతిని హోం మంత్రి అనిత అందజేశారు. ద్వితీయ బహుమతిని కడప జిల్లాకు చెందిన పి.రమ్య, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వేణుభార్గవి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పి.సావిత్రి గెలుచుకున్నారు. విజేతల్లో పి.రమ్యకు అబ్బూరి రత్నలక్ష్మి, వేణుభార్గవికి సూరపనేని ఉషారాణి, పి.సావిత్రికి గద్దె అనురాధ రూ.10 వేల చొప్పున బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. మహిళలు వేసిన ప్రతి ముగ్గులోనూ అనేక దృక్కోణాలు ఉంటాయన్నారు. నవమాసాలు మోసి ఒక బిడ్డకు జన్మనిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటారో ఆ విధంగా ముగ్గులను తీర్చిదిద్దుతారన్నారు.


మహిళల్లో ఉన్న సమర్థత, నైపుణ్యానికి ఇది గొప్ప నిదర్శనమన్నారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అత్యంత శక్తిమంతులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. తనతో తన తండ్రి చిన్నతనం నుంచి డిగ్రీ చదివే వరకు ముగ్గులు వేయించారని బాల్యస్మృతులను గుర్తు చేసుకున్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి చేస్తున్న కృషిని గద్దె అనురాధ అభినందించారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి 18 ఏళ్లుగా ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తోందని న్యూస్‌ ఎడిటర్‌ కె.నాగసుధాకర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ విజయవాడ బ్రాంచ్‌ మేనేజర్‌ వి.మురళి, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌ ఇన్‌చార్జి టి.సురేశ్‌ కుమార్‌, ‘ఆంధ్రజ్యోతి’ అడ్వర్టైజ్‌మెంట్‌, సర్క్యులేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 04:19 AM