ప్లాన్.. మారింది!
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:53 AM
భవన నిర్మాణానికి ప్లాన్ అప్రూ వల్‌ను సులభతరం చేసేందుకు ప్రభుత్వం స్వీయ సర్టిఫికేషన్ స్కీమ్ 2025 (ఎస్‌సీఎస్) తీసుకొచ్చింది.

భవన నిర్మాణాల ప్లాన్‌లకు మునిసిపల్ అనుమతులు అక్కర్లేదు
ఇకపై ఎల్‌టీపీలకు అధికారం అప్పగింత
బిల్డింగ్ అప్రూవల్‌పై నూతన మార్గదర్శకాలు
ఏలూరు టూటౌన్, మార్చి 14 (ఆంధ్ర జ్యోతి) : భవన నిర్మాణానికి ప్లాన్ అప్రూ వల్‌ను సులభతరం చేసేందుకు ప్రభుత్వం స్వీయ సర్టిఫికేషన్ స్కీమ్ 2025 (ఎస్‌సీఎస్) తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మునిసిపల్ అధికారులు ప్లాన్‌లు అప్రూవల్ చేసేవారు. ప్లాన్ అప్రూవల్‌కు మునిసిపల్ సిబ్బంది లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్లాన్ అప్రూవల్ లో కాలయాపన జరుగుతోందని ప్రభుత్వం గుర్తించి ఎస్‌సీఎస్ చట్టం తీసుకొచ్చింది. మునిసిపల్ అధికారుల నుంచి ప్లాన్ అప్రూ వల్ అధికారం తీసివేసింది. ప్లాన్ అప్రూవల్ లో ప్రజల భాగస్వామం ఉండాలనే ఉద్దేశం తో లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సనర్స్ (ఎల్‌టీపీ లకు) ప్లాన్ అప్రూవల్ అధికారం ఇచ్చింది.
కొత్తస్కీమ్ ప్రకారం ఎల్‌టీపీలే మునిసి పల్ నిబంధనల ప్రకారం ప్లాన్ వేసి వారికి అప్రూవల్ చేసే అధికారం ఇచ్చింది. ప్లాన్ వేయడం, అప్రూవల్ చేయడం లో అవకతవకలు జరిగితే వారినే బాధ్యులను చేసింది. ఒకవేళ భవన నిర్మాణ యజమానులు ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణం చేస్తే దానిని నిలిపి వేసే అధికారం ఎల్‌టీపీలకు కట్టబెట్టింది. భవన యజమాని నిజాయితీగా వ్యవహరిం చకపోతే ఇంటి నిర్మాణం ఆపుచేయడంతో పాటు జరిమానా విధిస్తారు. ఎల్‌టీపీలు పొరపాట్లు చేస్తే లైసెన్సును ఐదేళ్ల పాటు రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెడతామని చట్టంలో పేర్కొంది. అయితే ఎస్‌సీఎస్ చట్టాన్ని ఎల్‌టీపీలు, మునిసిపల్ సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వ పాల నలో పౌరులకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమును ప్రభుత్వం తీసుకొ చ్చినట్లు చెబుతోంది.
కొత్త మార్గదర్శకాలు ఇలా..
300 చదరపు మీటర్లు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న నిర్మాణాలు సాగించుకోవడా నికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.
ఆన్‌లైన్ భవన అనుమతి వ్యవస్థ (ఓబీపీఎస్) ద్వారా ఎల్‌టీపీలకు దరఖాస్తుదారు స్వీయ ధ్రువీకర ణతో దరఖాస్తు చేసుకోవాలి.
స్వీయ ధ్రువీకరణ దరఖాస్తుతో పాటు నిర్మించబోయే స్థలానికి సంబంధించిన భూమి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు సరైనవేనని దరఖాస్తుదారు సంతకం చేయాలి. దరఖాస్తుతో పాటు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు, తనఖా పత్రాలు జతచేయాలి. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత ఎల్‌టీపీలు ఆన్‌లైన్‌లో దర ఖాస్తును అప్రూవల్ చేయాలి. అన్ని సక్రమంగా ఉంటే ఓపీబీఎస్ ఆన్‌లైన్‌లో ప్లాన్ వెంటనే అప్రూవల్ అవుతుంది. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభించుకోవచ్చు.
స్థల యజమాని ప్లింత్‌బీమ్ పూర్తయిన ఏడు రోజుల లోపు ఎల్‌టీపీలు ఫొటోతీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ చేయకపోతే ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరిగిందని పరిగణించ బడుతుంది. ఆ తర్వాత శ్ల్లాబ్, భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. నిర్మాణం తర్వాత ఎల్‌టీపీలే అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగనట్టయితే ఈ విషయాన్ని సంబం ధిత మునిసిపల్ అధికారులకు ఎల్‌టీపీ లు తెలపాలి. అలా చేయకుంటే ఎల్‌టీపీలపై చర్యలు తీసుకునే అధికారం మునిసిపల్ అధికారులకు ఉంటుంది.
ఆ తర్వాత మునిసిపల్ అధికారులు తని ఖీ చేసి ప్లాన్ ప్రకారం నిర్మించకుండా నిర్మాణం జరిగినట్టు నిర్ధారణ అయితే యజమానికి పై చర్యలు తీసుకుని నిర్మా ణం నిలుపుదల చేస్తారు. ఉల్లంఘలను యజమానికి సరి చేస్తే మళ్లీ తదుపరి నిర్మాణానికి అనుమతిస్తారు. ప్లాన్ ఆన్ లైన్ చేసిన తర్వాత ఏమెనా చేర్పులు మార్పులు ఉంటే సరిచేసే అధికారం ఎల్ టీపీలకు ఉంటుంది.
స్వీయ ధ్రువీకరణ భవనాల్లో ఏదైన అవకతవకలు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది గమనించినప్పుడు, ఇతర వ్యక్తుల ద్వారా వచ్చిన పిర్యాదులు గమనించినప్పుడు నిబంధనల ప్రకారం భవనంపై చర్యలు తీసుకుంటారు. ఎల్‌టీపీలపై నిబంధనల ప్రకారం చర్యలుంటాయి.
క్రిమినల్ చర్యలు తగదు
ప్రభుత్వం ఎల్‌టీపీలకు ప్లాన్‌అప్రూవల్ అధికారం ఇవ్వడం ప్రజలకు ఉపయోగ పడుతుంది. స్థల యజమాని ప్లాన్ ప్రకారం నిర్మించకపోతే ఎల్‌టీపీలను బాధ్యులను చేయడం సరికాదు. భవన యజమాని చేసిన తప్పులకు ఎల్‌టీపీల లైసెన్సులు ఐదేళ్లు రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
– డి.బాలాజీ, ఎల్‌టీపీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఎల్‌టీపీలకు అన్ని తెలుసు
క్షేత్రస్థాయిలో భవనాలు నిర్మించే భూముల పూర్వపరాలు మాకంటే ఎక్కువ ఎల్‌టీపీలకే తెలుసు. ప్లాన్ అప్రూవల్ అధికారం ఎల్‌టీపీలకు ఇవ్వడం వల్ల జాప్యం జరగదు. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. ప్లాన్ ప్రకారం బిల్డింగ్ కడుతున్నాడా..లేదా.. పర్య వేక్షించే బాధ్యత ఎల్‌టీపీలకే కట్టబెట్టడం సరైన చర్య.
ఎన్.శ్రీనివాస్, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్