Indian Navy: 2,500 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:58 AM
పశ్చిమ హిందూ మహాసముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బోట్లను తనిఖీ చేసిన నేవీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తర్కాశ్ అధికారులు 2,500 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్నం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): సముద్ర మార్గాన తరలిస్తున్న 2,500కిలోల మాదక ద్రవ్యాలను నేవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ హిందూ మహాసముద్రంలో కొన్ని బోట్లు అనుమానంగా సంచరిస్తున్నాయని యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తర్కాశ్‌కు సమాచారం అందిం ది. దీంతో మార్చి 31న మెరైన్ కమెండోలతో తర్కాశ్ అక్కడకు చేరుకుంది. కమెండోలు బోటులోకి వెళ్లి తనిఖీలు చేయగా 2,500 కిలోల మాదక ద్రవ్యాల సంచులు లభించాయి. వాటిలో 2,386 కిలోల హషీష్, 121 కిలోల హెరాయిన్ ఉన్నట్టు నేవీ వర్గాలు బుధవారం తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..