పాస్టర్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:55 PM
పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వి చారణ చేపట్టాలని రైల్వేకోడూరు పట్టణంలోని ఎస్‌ఏఎల్‌సీ చర్చి సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.

రైల్వేకోడూరు రూరల్, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వి చారణ చేపట్టాలని రైల్వేకోడూరు పట్టణంలోని ఎస్‌ఏఎల్‌సీ చర్చి సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని టోల్‌గేట్ వద్ద ఉన్న చర్చి ప్రాంగణంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ఇమ్మానియేల్ బాబు మా ట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పదంగా మృ తి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ మరణంతో క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. పాస్టర్ మృతిపై ప్రభు త్వం విచారణ నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చాలని వారు కోరారు.