Inter Results Top Districts: ఇంటర్ ఫలితాల్లో టాప్‌లో నిలిచిన జిల్లాలు ఇవే
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:14 PM
Inter Results Top Districts: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ పాస్ పర్సంటేజ్ నమోదు అయ్యింది. ఇంటర్ ఫలితాల్లో మూడు జిల్లాలు టాప్ త్రీ ప్లేస్‌లో నిలిచాయి.

అమరావతి, ఏప్రిల్ 12: ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఇంటర్ ఫలితాలు (AP Inter Results) రానే వచ్చేశాయి. ఏపీలో ఇంటర్ ఫలితాలు రిలీజ్ అవడంతో విద్యార్థులు తమ తమ ఫలితాలను చెక్ చేసుకుంటారు. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మన మిత్ర వాట్సప్, మన బడి వెబ్‌సైట్స్‌లో ఫలితాలను చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఇంటర్ ఫలితాల్లో ఈసారి అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 3 శాతం, రెండవ సంవత్సరంలో 5శాతం పాస్ పర్సెంటేజ్ పెరిగింది. ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మూడు జిల్లాలు టాప్‌లో నిలిచాయి.
కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, చిత్తూరు జిల్లాలు మాత్రం ఆఖరున నిలిచాయి. అలాగే మొదటి సంవత్సరం ఫలితాల్లోనూ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు టాప్ త్రీలో ఉండగా.. చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, సత్యసాయి జిల్లాలు ఆఖరి వరుసలో నిలిచాయి.
నిరాశ వద్దన్న మంత్రి
ఇంటర్ ఫలితలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో విడుదల చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని మంత్రి తెలిపారు. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు, విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణమని చెప్పుకొచ్చారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దన్నారు. దీనిని ఒక అడుగుగా భావించి, మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు త్వరగా తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయండి
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News