CM Chandrababu: వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. ఫోటోలు దిగిన చంద్రబాబు..
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:05 PM
ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చిన సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు స్థానికులు ఆసక్తి కనపరిచారు. సరదాగా, ఆప్యాయంగా వారితో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అమరావతి: ఏపీలో కృష్ణ (Krishna), గుంటూరు జిల్లాల (Guntur Dist.) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) నేపథ్యంలో పట్టభద్రుల ఓటు హక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబుతో మాట్లాడేందుకు స్థానికులు ఆసక్తి కనపరిచారు. సరదాగా, ఆప్యాయంగా వారితో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు, మహిళలు కోరిక మేరకు వారితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి చంద్రబాబుకు నమస్కారం చేసింది. ప్రతిగా సీఎం కూడా నమస్కారం చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్స్..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజలకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంచి ప్రభుత్వం కావాలంటే పోలింగ్ రోజు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పట్టభద్రులుగా నమోదైన ప్రతిఒక్కరూ.. ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమని, ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ నెంబర్ 284A లో చంద్రబాబు, లోకేష్ ఓటు వేశారు.
ఐదేళ్ల రాక్షస పాలన చూశారు..
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏకే టీపీ స్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్‌ను ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా, మంత్రి సత్య కుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 25 శాతం పోలింగ్ నమోదయిందని, చదువుకున్న విద్యార్థులంతా ముందుకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఓటు హక్కుతో సరైన నాయకుడు ఎన్నుకోబడతాడని.. సమాజానికి మంచి సేవలు అందించగలుగుతారని అన్నారు. ప్రజలు ఇప్పటివరకు ఐదేళ్ల రాక్షస పాలన చూశారని, చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు మంచి పాలన చూస్తున్నారన్నారు. గడిచిన ఎనిమిది నెలలలో లక్షల కోట్ల పెట్టుబడులు, ఇండస్ట్రీలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు , అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయన్నారు. ఈ సాయంత్రంలోగా ఎక్కువమంది వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తున్నానని బోండా ఉమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పోలీస్ స్టేషన్‌కు పోసాని.. ఎందుకంటే..
ఈరోజైనా వంశీ నోరు విప్పుతారా..
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News