Share News

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

ABN , Publish Date - Jan 27 , 2025 | 01:14 PM

Deputy CM Pawan: నారా దేవన్ష్‌‌ను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ప్రశంసించారు. కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దేవాన్ష్ స్థానం సంపాదించారన్నారు. అతి చిన్న వయసులోనే చెస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని.. భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు పవన్.

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Deputy CM Pawan Kalyan

అమరావతి, జనవరి 27: చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్‌ కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసి సత్తా చాటిన ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్‌‌పై (Devansh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Deputy CM Pawan Kalyan) ప్రశంసలు కురిపించారు. చెస్‌లో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా దేవాన్ష్‌‌ను ప్రశంసించారు పవన్. కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దేవాన్ష్ స్థానం సంపాదించారన్నారు. అతి చిన్న వయసులోనే చెస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని.. భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు సామాజిక మాద్యమంలో పవన్ పోస్టు చేశారు.


పవన్ ట్వీట్ ఇదే..

‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పిన్న వయసులోనే చెస్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన దేవాన్స్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి, గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.


కాగా.. చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్‌ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 59 సెకన్లలోనే పూర్తిచేసి ‘ఫాస్టెస్ట్‌ చెక్‌మేట్‌ సాల్వర్‌’గా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు దేవాన్స్‌. ప్రసిద్ధ చెస్‌ సంకలనం నుంచి ఎంపిక చేసి న 5,334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఈ పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆపై లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి దేవాన్స్‌కు సర్టిఫికెట్‌ అందింది. కాగా.. ఇటీవల దేవాన్ష్‌ చెస్‌లో మరో రెండు ప్రపంచ రికార్డులు కూడా సాధించాడు. 7 డిస్క్‌టవర్‌ ఆఫ్‌ ఆఫ్‌ హనోయిని కేవ లం 1.43 నిమిషాల్లో పూర్తిచేశాడు. 9 చెస్‌ బోర్డులను కేవలం ఐదు నిమిషాల్లో అమర్చి.. 32 పావులను వేగం గా సరైన స్థానాల్లో పెట్టాడు.


ఇవి కూడా చదవండి...

ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈ దేశాలకు సహాయం బంద్

సాయంత్రం 4 గంటలకు ఎండీకి సమ్మె నోటీసు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 27 , 2025 | 01:15 PM