రైతుబజారులో మంత్రి నాదెండ్ల తనిఖీ
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:23 AM
వినియోగ దార్లకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బజార్లను నిర్వహిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

రైతుబజారులో
మంత్రి నాదెండ్ల తనిఖీ
పటమట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): వినియోగ దార్లకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బజార్లను నిర్వహిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన బుధవారం ఆటోనగర్‌లోని ఏపీఐసీసీలో ఉన్న రైతుబజారును తనిఖీ చేశారు. అధికారులతో కలిసి సరుకులను పరిశీలించారు. వినియోగదార్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బియ్యాన్ని పరిశీలించారు. 26 కిలోల ఉన్న 204 బస్తాలను స్వాధీనం చేసుకోవాలని ఎస్టేట్ ఆఫీసర్‌ను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం రైతు బజారుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. రైతు బజార్ల నిర్వహణపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు నాణ్యమైన ఉత్పత్తులు పొందేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.