Share News

గేదెను తప్పించబోయి బైక్‌తో గోడను ఢీకొన్న యువకుడు

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:43 AM

బైక్‌పై వెళుతుండగా అడ్డు వచ్చిన గేదెను తప్పించబోయి గోడను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువ కుడు గొల్లపూడిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందాడు.

 గేదెను తప్పించబోయి బైక్‌తో గోడను ఢీకొన్న యువకుడు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

జి.కొండూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): బైక్‌పై వెళుతుండగా అడ్డు వచ్చిన గేదెను తప్పించబోయి గోడను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువ కుడు గొల్లపూడిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందాడు. ఈ ఘటన వెల్లటూరు గ్రా మంలో శనివారం జరిగింది. వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన షోడగిరి రాజేష్‌(24) వెల్లటూరులో ఉంటున్న తన బంధువుల ఇంటికి వచ్చి వెళుతూ గ్రామంలో అడ్డు వచ్చిన గేదెను తప్పించబో యి పక్కనే ఉన్న గోడను ఢీ కొన్నాడు. తలకు బలమైన గాయం కావడంతో 108లో వైద్యశాలకు తరలించారు. శనివారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. మృతుని తమ్ముడు ఫిర్యాదుపై ఆదివారం కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 31 , 2025 | 12:48 AM