Hyderabad: బంగారానికి ఫేక్ కరెన్సీ..
ABN , Publish Date - Apr 12 , 2025 | 09:41 AM
బంగారం తీసుకొని నకిలీ కరెన్సీని అంటగట్టి పరారైన అంతర్రాష్ట్ర దొంగలను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ ముళా గత కొద్దిరోజులుగా బంగారం తీసుకొని నకిలీ కరెన్సీని అంటగడుతున్నారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో మొత్తానిరి వారి ఆటకట్టించి వారిని అరెస్టు చేశారు.

- వ్యాపారులకు కుచ్చుటోపీ
- ఇద్దరు అంతర్రాష్ట్ర మోసగాళ్ల అరెస్టు
హైదరాబాద్ సిటీ: నకిలీ కరెన్సీని అంటగట్టి బంగారంతో ఉడాయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ఆటకట్టించారు సీసీఎస్ పోలీసులు(CCS Police). రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు క్రిమినళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.60 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఇంద్రజిత్ అలియాస్ విరాట్, మంగీలాల్ ఇద్దరూ దృష్టి మళ్లించి మోసాలు చేయడంలో ఆరితేరిన నిందితులు. వ్యాపారులను లక్ష్యంగా చేసుకుంటున్న ఇద్దరూ ముందుగా ఆర్డర్‌పై బంగారు ఆభరణాలు చేయిస్తారు. డబ్బులు చెల్లించే క్రమంలో ఒరిజినల్ కరెన్సీతో పాటు, ఎక్కువ మొత్తంలో నకిలీ కరెన్సీని అంటగట్టి బంగారంతో ఉడాయిస్తారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చదివింది బీఎస్సీ.. చేసేది స్మగ్లింగ్
ఇటీవల నగరంలో బంగారు నగల వ్యాపారిని మోసం చేసి రూ. 60 లక్షలు నకిలీ కరెన్సీ అంటగట్టి కుచ్చుటోపీ పెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. డీసీపీ శ్వేత ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి(DCP Swetha ACP Venkateswara Reddy) పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ భిక్షపతి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇంద్రజిత్‌పై రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లాలో 15కు పైగా దృష్టి మళ్లించి మోసం చేసిన కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ వార్తలు కూడా చదవండి:
రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!
రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్
Read Latest Telangana News and National News