అంబేడ్కర్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:26 AM
అంబేడ్కర్ జయంతి సందర్భం గా ఓర్వకల్లు ఎస్సీ బాలికల వసతి గృహంలో నూతనంగా నిర్మించిన అంబే డ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆవిష్కరించి నివాళులర్పించారు.

ఓర్వకల్లు, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ జయంతి సందర్భం గా ఓర్వకల్లు ఎస్సీ బాలికల వసతి గృహంలో నూతనంగా నిర్మించిన అంబే డ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సోమవారం అనంతరం సచి వాలయం సమీపాన నూతనంగా నిర్మించిన పశువుల నీటి తొట్టిని ప్రారంభించారు. అలాగే బస్టాండు సమీపంలో దళిత సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంపీడీవో శ్రీనివాసులు, ఈవోఆర్‌డీ సుబ్బరాయుడు, ఎస్‌ఐ సునీల్ కుమార్, వార్డెన్లు ప్రమీలారాణి, సుంకన్న, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, ఉపాధ్యక్షులు మోహన రెడ్డి, నాయకులు రాంభూపాల్ రెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, భాస్కర్ రెడ్డి, మహబూబ్ బాషా, ఏసేపు పాల్గొన్నారు.
కర్నూలు అర్బన: జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాదిగ కార్పొరేషన డైరెక్టర్ ధరూర్ జేమ్స్ ఆఽధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ యువనేత కేఈ సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, నగర అధ్యక్షులు నాగరాజు యాదవ్, నాయీ బ్రహ్మణ కార్పొరేషన డైరెక్టర్ పాలక వీటి విజయ కుమార్, పేరపోగు రాజు, సత్రం రామక్రిష్ణ, హనుమంతరావుచౌదరి, వేంపెంట రాంబాబు నివాళి అర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ విగ్రహానికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జీలాని, మాజీ ఎమ్మెల్సీ సుఽధాకర్ బాబు, ఓబీసీ జిల్లా చైర్మన డీవీ సాంబశివుడు, ప్రమీల, షేక్ ఖాజా హుస్సేన, రాజేం ద్రప్రసాద్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాయలసీమ యూనివర్సిటీలోని పాత లైబ్రరీ భవనం వద్ద ఉపకులపతి వెంకట బసవరావు అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు. వర్సిటీ ముఖ ద్వారం ఎదుట 10 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి రిజిసా్ట్రర్ బోయ విజయకుమార్ నాయుడుతో కలిసి భూమిపూజ చేశారు. క్లస్టర్ వరిసటీ రిజిసా్ట్రర్ కట్టా వెంకటేశ్వర్లు, డీనలు పాల్గొన్నారు.
కర్నూలు అగ్రికల్చర్: కర్నూలు మార్కెట్ కమిటీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ, సెక్రటరీలు కేశవరెడ్డి, నాగేష్, శివన్న, సెక్యూరిటీ గార్డుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కిరణ్, మద్దిలేటి పాల్గొన్నారు.
కర్నూలు కలెక్టరేట్: నగరంలోని క్లస్టర్ యూనివర్సిటీ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహానికి టీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేసన కన్వీనర్ రాఘవేంద్ర, భీమ్ ఆర్మీ కన్వీనర్ విజయభాస్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కర్నూలు కల్చరల్: వీహెచపీ - సామాజిక సమరసత విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండులోని అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. వీహెచపీ జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిలేటి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎల్ అమరసింహారెడ్డి, గోవిందరాజులు పాల్గొన్నారు.
కర్నూలు క్రైం: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అడిషినల్ ఎస్పీలు హుశేనపీరా, కృష్ణమోహనలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్‌ఐలు జావేద్, సోమశేఖర్ నాయక్, నారా యణ, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన: రాజ్‌విహార్ సమీపంలోని అంబేడ్కర్ భవనంలో అంబేడ్కర్ విగ్రహానికి డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప, రత్నం ఏసేపు, లక్ష్మీనారాయణ నివాళి అర్పించారు. బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో అంబ్కేడర్ జయంతి వేడుకలు ఆర్‌ఐవో గురువయ్య శెట్టి, ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో జరిగాయి. గ్రామీణ సేవ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ డైరెక్టర్ పుష్పకుమార్, నైస్ కంప్యూటర్ ప్రతినిధి రాయపాటి శ్రీనివాస్‌రావు, మీసీ వెల్పేర్ ఆఫీసర్ బెన్నమ్మ, అధ్యాపకులు పాల్గొన్నారు.
కర్నూలు న్యూసిటీ: జిల్లా పరిషత మినీ సమావేశ భవనంలో సీఈఓ జి.నాసరరెడ్డి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో పరిపాలన అధికారులు మురళీ మోహ నరెడ్డి, జితేంద్ర, బసవశేఖర్, నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు. కార్పొరేషన కార్యాలయంలో కమిషనర్ రవీంద్రబాబు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేనేజర్ చిన్నరా ముడు, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, ఆర్‌ఓ జునైద్ పాల్గొన్నారు.
కర్నూలు(రూరల్): కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడు పరిధిలోని విజ్ఞాన పీఠం అరక్షిత బాలుర పాఠశాలలో విజ్ఞాన సేవా సమితి ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. విజ్ఞాన సేవ సమితి ప్రతినిధులు రామిరెడ్డి, రమణారెడ్డి, మద్దిలేటి, వి. సుంకన్న, రమణయ్య, రణధీర్‌రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.
కర్నూలు హాస్పిటల్: అంబేడ్కర్ గొప్ప దార్శనికుడు అని ఏపీ గవర్నమెంటు డాక్టర్ల అసోసియేషన అధ్యక్షుడు ఫోరెన్సిక్ మెడిసిన డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఏపీజీడీఏ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్లు నాగేశ్వరరావు, రామశివనాయక్, శ్రీరాములు, సాయిసుధీర్ పాల్గొన్నారు.
కోడుమూరు: కోడుమూరు పట్టణంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మునుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి హాజరయ్యారు. కొత్త బస్టాండ్ సమీపం లోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బడేసా, గౌడ్, గోపాల్ నాయుడు, బలరాం పాల్గొన్నారు. అలాగే వైసీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. జడ్పీటీసీ రఘునాథ్‌రెడ్డి, నాయకులు రమేష్ నాయుడు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అలాగే ఎమ్మార్పీఎస్ ఆధ్వ ర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి సర్పంచ భాగ్యరత్న పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆంధ్రయ పాల్గొన్నారు. అలాగే పాలకుర్తిలో అంబేడ్కర్ విగ్రహానికి టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రమౌలి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, యూసుప్, షేక్షావలి, సుంకన్న పాల్గొన్నారు.
గూడూరు: గూడూరు మండలం కె.నాగలాపురం గ్రామంలో అంబే డ్కర్ ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి మండల టీడీపీ అఽధ్యక్షుడు జె సురేష్ పూలమాలలు వేసి నివా ళులర్పించారు. సభ్యులు ఆంజనేయులు, సురేష్, సురేంద్ర, దిలీప్, అనిల్, సుధీర్ పాల్గొన్నారు.