Share News

జగ్జీవనరామ్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:49 AM

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవనరామ్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం 31వ వార్డు షరీననగర్‌, బి.క్యాంపు ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఆయన విగ్రహానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

జగ్జీవనరామ్‌కు ఘన నివాళి
జగ్జీవనరామ్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవనరామ్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం 31వ వార్డు షరీననగర్‌, బి.క్యాంపు ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఆయన విగ్రహానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసంద ర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జగ్జీవనరామ్‌ అని కొని యాడారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ యాదవ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌, జాతీయ బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, 31, 29వ వార్డు టీడీపీ ఇనచార్జిలు శైలజాయాదవ్‌, శ్రీనివాసరావు, రాంబాబు, క్యాతూరు మధు పాల్గొన్నారు.

కర్నూలు ఎడ్యుకేషన: బాబు జగ్జీవనరామ్‌ గొప్ప సంఘసంస్కర్త పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కొనియాడారు. శనివారం స్థానిక ఐదు రోడ్ల కూడలి జంక్షనలో జగ్జీవన రామ్‌ విగ్రహానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడు మూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, కార్పొరేషన కమిషనర్‌ రవీంద్రబాబు, మాల సంఘం విద్యార్థి నాయకులు వెంకటేశ, ప్రకాష్‌ మాదిగ, డీఎస్పీ మహబూబ్‌ బాషా, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.

కర్నూలు లీగల్‌: కర్నూలు బార్‌ అసోసియేషన కార్యాలయంలో జగ్జీవనరామ్‌ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ న్యాయవాది వై.జయరాజు, బార్‌ అసోసియేషన అధ్యక్షుడు పి.హరినాథ చౌదరి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి బాలసు బ్రహ్మణ్యం, గ్రంథాలయ కార్యదర్శి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

కర్నూలు క్రైం: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జగ్జీ వనరామ్‌ చిత్రపటానికి అడిషనల్‌ ఎస్పీ అడ్మిన హుశేనపీరా పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సదరన రీజియన హోంగార్డు కమాండెంట్‌ మహేష్‌ కుమార్‌, ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ కృష్ణమోహన, ఆర్‌ఐలు జావేద్‌, నారాయణ, సోమశేఖర్‌ నాయక్‌, ఆర్‌ఎ స్‌ఐలు, ఏఆర్‌ పోలీసులు పాల్గొన్నారు.

కర్నూలు న్యూసిటీ: నగరంలోని ఆర్‌ఎస్‌ కూడలిలోని జగ్జీవనరామ్‌ విగ్రహానికి పలువురు రాజకీయ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు జగ్జీవనరామ్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కర్నూలు అర్బన: నగరంలోని పోస్టల్‌ కాలనీలోని జగ్జీవనరామ్‌ విగ్రహానికి రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్‌ ఫెడరేషన నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం లక్ష్మి ప్రశాంత, డి.దివాకర్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు రోహిత, చిన్న, సునీల్‌, నిరంజన పాల్గొన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో జగ్జీవనరామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. రెక్టార్‌ ఎనటీకే నాయక్‌, పరీక్షల విభాగం కంట్రోలర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్లు, ఎనఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ పి.నాగరాజు, అధ్యా పకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జగ్జీవనరామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నగర పార్టీ అధ్యక్షుడు షేక్‌ జిలానీ బాషా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు, దామోదరం రాధాకృష్ణ, అనంతరత్నం మాదిగ, ఐనటీ యూసీ జిల్లా అధ్యక్షులు బతుకన్న, ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మన బజా రన్న, షేక్‌ ఖాజా హుస్సేన, ప్రమీల, లాజరస్‌ పాల్గొన్నారు.

ఓర్వకల్లు: ఓర్వకల్లులోని ఎంపీడీవో కార్యాలయంలో జగ్జీవనరామ్‌ చిత్రపటానికి ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీపీ తిప్పన్న, జడ్పీటీసీ రంగ నాథగౌడు టీడీపీ మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గూడూరు: గూడూరులో కేవీపీఎస్‌ మండల ఉపాధ్యక్షుడు కొమ్ము శేషన్న అధ్యక్షతన జగ్జీవనరామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రప టానికి సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి జె మోహన, కేవీపీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి రేపల్లె పెద్దబాబు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. సీఐటీయూ నాయకులు దానమన్న, శాంతన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:50 AM