Share News

కనీస మద్దతు ధర ప్రకటించాలి

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:01 AM

రాష్ట్రంలో రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలోని లక్ష్మీ నరసింహకల్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం అధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం అధ్యక్షతన జాతీయ రైతు సదస్సు నిర్వహించారు.

కనీస మద్దతు ధర ప్రకటించాలి
మాట్లాడుతున్న ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య

కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్‌

కర్నూలులో జాతీయ రైతు సదస్సు

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలోని లక్ష్మీ నరసింహకల్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం అధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం అధ్యక్షతన జాతీయ రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రితో పాటు ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నల్లచట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏపీలో సీపీఐకి తెలంగాణ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర ఉందన్నారు. అధికారం లోకి రాకముందు డాక్టర్‌ స్వా మినాథన్‌ కమిషన్‌ సిఫార సులు అమలు చేస్తామని చెప్పిన మోదీ మాట తప్పారని విమర్శించారు. ఫసల్‌ బీమా పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం భూసంస్కరణ చట్టం తీసుకువచ్చిందన్నారు. రైతులకు ఉపయోగపడే చట్టాలను తీసుకువచ్చే విష యంలో సీపీఐ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. రైతుల సమస్యలపై చర్చించి జాతీయ మహసభలలో తీర్మానం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామ న్నారు. ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేంద్రయ్య, పంపన్నగౌడు, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మి నరసింహయాదవ్‌, సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి ఎస్‌.మునెప్ప, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుగు నరసింహులు యాదవ్‌, రైతు సంఘం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కమ్యూనిస్టుల పోరాటం అభినందనీయం

రైతు సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టులు, ఏపీ రైతు సంఘం చేస్తున్న పోరాటాలు అభినందనీయం. తాను స్వతహాగా రైతునని చెప్పుకోవ డానికి గర్వపడుతున్నా. మంత్రిగా పని చేస్తున్న సమయంలో రైతుల కోసం ఆహర్నిశలు కృషి చేశాను. ఉపాధి హమీ చట్టం వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే డిమాండ్‌ చాలా మంచిది. రైతుల సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటాల్లో తమ మద్దతు ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్‌ ప్రాజెక్టులతో పాటు వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం, అలుగు పూర్తి చేయాలి. మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి రైతులకు రుణమాఫీ చేయలేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హమీని అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలను రైతుల ఖాతాల్లో జమ చేయాలి. - ఎన్‌.రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి

ఎన్డీయే హయాంలో రైతుల ఆత్మహత్యలు

మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో సుమారు 3.49లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పిన మోదీ కార్పొరేట్‌ శక్తుల ఆదాయం పెంచే పనిలో ఉన్నారు. మద్దతు ధర లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా పెట్టుబ డిదారులకు మోదీ అనుకూలంగా ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. వెంటనే రైతులకు వ్యతిరేకంగా చేసిన నల్ల చట్టాలను రద్దు చేయాలి. కనీస మద్దతు ధర చట్టబద్దత కల్పించాలి. - రావుల వెంకయ్య, ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి

దేశాన్ని కాపాడేది లౌకిక పార్టీలే

దేశాన్ని కాపాడేది లౌకిక పార్టీలే. బీజేపీ దేశంలో మతతత్వాన్ని రెచ్చగొట్టి మరోమారు అధికార చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. మోదీ ప్రభుత్వం వ్యవసాయం గురించి ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రైతులను ఆదుకోవడంలో కేంద్రం విఫలమైంది. అంబాని, అదానికి ఊడిగం చేయడం తప్ప రైతులకు చేసిందేమి లేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ప్రజలను పట్టించుకోకుండా మోదీ మాయలో ఉన్నారు. - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

Updated Date - Apr 05 , 2025 | 12:01 AM