TG Bharath: టమాటా జ్యూస్ ఫ్యాక్టరీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, Publish Date - Mar 14 , 2025 | 02:05 PM

TG Bharath: ఓర్వకల్లులో స్టీల్ ఫ్యాక్టరీని వచ్చే నెల 19వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇతర పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తారని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.

TG Bharath: టమాటా జ్యూస్ ఫ్యాక్టరీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
TG Bharath

కర్నూలు: భూ సమస్యలతో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం నాలుగు నెలలుగా ఆలస్యం అయ్యిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆరు నెలల్లో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. మళ్లీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే ప్రారంభిస్తామని చెప్పారు. రూ. 11 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక రోజుకు 15 టన్నులు ప్రాసెసింగ్ అవుతుందన్నారు. టమాటాతో పాటు ఈ యూనిట్‌లో ఇతర పండ్ల ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసుకోవచ్చని మంత్రి టీజీ భరత్ తెలిపారు.


ఇక నుంచి రైతులు గిట్టుబాటు ధర లేక టమాటాను రోడ్లమీద పారబోసే పరిస్థితి ఉండదని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రావాలని సీఎం చంద్రబాబు నుంచి అదేశాలు వచ్చాయని అన్నారు. ఓర్వకల్లులో స్టీల్ ఫ్యాక్టరీని వచ్చే నెల 19వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఇతర పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది.. ఇండియా మ్యాప్‌లో కనిపించేది కాదని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.


వైసీపీకి ఆ అర్హత లేదు: మంత్రి బాల వీరాంజనేయ స్వామి

ప్రకాశం : విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విద్యుత్ రంగంలో టీడీపీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. 2014-2019లో మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని మాజీ సీఎం జగన్‌కు అప్పగించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం స్వార్థంతో విద్యుత్ రంగాన్ని నష్టపరిచిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు.


అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడికి పింఛన్లు తొలగించడం లేదని స్పష్టం చేశారు. అర్హులకు పింఛన్లు తొలగిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో జనాన్ని తీసుకువచ్చారని అన్నారు. తాను పెంచిన విద్యుత్ ఛార్జీలను తానే తగ్గించాలని ధర్నా చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని విమర్శలు చేశారు. తాను బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని.. జగన్ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: జనసేన పవర్ ముందు జగన్ డీలా.. నాడు అలా.. నేడు ఇలా

ABN Effect: వీఆర్‌‌కు సీఐ భుజంగరావు

For More AP News and Telugu News

Updated Date - Mar 14 , 2025 | 02:38 PM