కళ్లు నెత్తికెక్కాయా..?
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:46 PM
‘బుద్ధి ఉండక్కర్లేదా.. కళ్లు నెత్తికెక్కాయా.. మీరేమైనా గాడిదలు కాస్తున్నారా..’ ఇవేవో సాధారణ వ్యక్తులు మాట్లాడిన మాటలు కావాలు. చిరు ఉద్యోగులపై ఆగ్రహంతో ఆదోని ఎమ్మెల్యే ఆగ్రహ మాటలు.

బుద్ధి ఉందా? గాడిదలు కాస్తున్నారా?
అధికారులపై ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం
రామాలయం వద్ద అపరిశుభ్రతపై అసహనం
ఆదోని, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ‘బుద్ధి ఉండక్కర్లేదా.. కళ్లు నెత్తికెక్కాయా.. మీరేమైనా గాడిదలు కాస్తున్నారా..’ ఇవేవో సాధారణ వ్యక్తులు మాట్లాడిన మాటలు కావాలు. చిరు ఉద్యోగులపై ఆగ్రహంతో ఆదోని ఎమ్మెల్యే ఆగ్రహ మాటలు. ఆదోని మండలంలోని పెద్దతుంబళం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలకు ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. అయితే రామాలయం సమీపంలో చెత్తా, చెదారం తొలగించకపోవడం, అపరిశుభ్రతను ఎమ్మెల్యే గమనించారు. దీంతో ఆయన అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్వయంగా ఎమ్మెల్యే పారచేత పట్టి రామాలయం దగ్గర ఉన్న చెత్తను తొలగించారు. ఒకవైపు గ్రామ కార్యదర్శి మల్లికార్జున, డీఎల్‌పీఓ, ఎంపీడీఓ, స్థానిక ఎస్‌ఐ ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెప్పడంతో నలుగురు అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను వస్తున్నానని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను ఏమనాలి అంటూ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు మధ్య సమన్వయలోపం కారణంగానే ఇలా జరిగిందన్నారు. ‘పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే బాగుండదు. ఎమ్మెల్యే వస్తున్నా కూడా ఇక్కడ లేకుండా వెళ్లిపోవడం ఏమిటి? నీ పని పద్ధతిగా లేదు. మార్చుకుంటే ఉండం డి. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోం డి. గాడిదలు కాస్తున్నారా..’ అంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు. శ్రీరామ నవమి ఉత్సవం ఉన్నప్పుడు నలుగురు అధికారులు ఒకరి పై ఒకరు నెట్టుకోవడం ఏమి టని ఎస్‌ఐపై మండి పడ్డారు. ఇక్కడ శుభ్రం అయ్యేం తవరకు దేవాల యం దగ్గర నుంచి వెళ్లేదే లేదని అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యే అక్కడ ఉండిపోయారు. అనంత రం ప్రొక్లెయినర్ సాయంతో రామాలయం వద్ద శుభ్రపరిచాక ఎమ్మెల్యే రాములోరికి పట్టు వస్త్రా లను సమర్పించి అక్కడి నుంచి వెళ్లారు.