Share News

అటెండెన్స్‌ను తారుమారు చేశారు..

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:07 AM

2023 మార్చి వరకు సంవత్సరం పాటు కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఆఫీసు సబార్డినేట్‌గా పని చేశానని, తన బయోమెట్రీ హాజరును తారుమారు చేసి అన్యాయం చేశారని నగరంలోని ఆరోరా నగర్‌కు చెందిన షేక్‌ మహబూబ్‌ బాషా, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు.

అటెండెన్స్‌ను తారుమారు చేశారు..

మంత్రి లోకేశ్‌కు ఓ ఆఫీస్‌ సబార్డినేట్‌ ఫిర్యాదు

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): 2023 మార్చి వరకు సంవత్సరం పాటు కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఆఫీసు సబార్డినేట్‌గా పని చేశానని, తన బయోమెట్రీ హాజరును తారుమారు చేసి అన్యాయం చేశారని నగరంలోని ఆరోరా నగర్‌కు చెందిన షేక్‌ మహబూబ్‌ బాషా, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. 2022 సెప్టెంబరులో బయోమెట్రీ హాజరును తారుమారు చేస్తూ అప్పటి ఐ-హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ 26 రోజులు పని చేసిన 20 రోజుల వేతనం ఇచ్చారని పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిసిడెన్సి సిస్టమ్‌ (పీజీఆర్‌ఎస్‌)లో మంత్రికి ఫిర్యాదు చేశారు. అప్పటి సూపరింటెం డెంట్‌ తనపై కల్పిత మెమో జారీ చేసి ఫోర్జరీ రికార్డులు పెట్టి జీతం రాకుండా చేశారని మాన్యువల్‌ అటెండెన్స్‌లో టాపయింగ్‌ చేసి అన్యాయం చేశారన్నారు. తనకు కోవిడ్‌కు సంబంధిత జీతం జమ చేయాలని ఉద్యోగం రాకుండా అప్పటి సూపరింటెండెంట్‌ అడ్డుకుంటున్నారని, ఫిర్యాదులో వివరించారు. ఈ నెల 9న ఐటీ మంత్రికి పిర్యాదు చేయగా.. డీఎంఈ ద్వారా కర్నూలు కలెక్టరేట్‌కు సమాచారం అందింది.

Updated Date - Apr 16 , 2025 | 12:07 AM