బాదుడు..!
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:59 AM
మండలంలో దాదాపు 25వేల ఎకరాలకు పైగా కంది సాగు చేశారు. పంట పూర్తయి దిగుబడి కూడా వచ్చింది. తీరా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర ఇస్తామన్న ప్రభుత్వం ఆమాటే మరిచింది

క్వింటానికి నాలుగు కేజీలు అదనంగా తీసుకుంటున్న వ్యాపారులు
కొనుగోలు చేస్తామని మాట మార్చిన అధికారులు
అవస్థలు పడుతున్న కంది రైతులు
తుగ్గలి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలో దాదాపు 25వేల ఎకరాలకు పైగా కంది సాగు చేశారు. పంట పూర్తయి దిగుబడి కూడా వచ్చింది. తీరా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర ఇస్తామన్న ప్రభుత్వం ఆమాటే మరిచింది
మాట తప్పిన అధికారులు
కందులను రూ.7,550ల ప్రకారం గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తా మని అధికారులు చెప్ప డంతో రైతులు ఆనందిం చారు. కందుల కొను గోళ్లకు రిజిస్ర్టేషన్ కూడా చేయించారు. అయితే ఏమైందో కాని నెలలు గడిచినా ఆ మాటే మరి చారు. దీంతో కందులను నిలువ చేసుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. పురుగు పడుతుందునని ఆందోళన చెందుతున్నారు.
వ్యాపారుల దోపిడీ..
కందులను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవ డంతో ఇదే అదనుగా భావించిన వ్యాపారులు దోపిడీకి తెరతీశారు. బాదు పేరుతో క్వింటానికి అదనంగా 4 కేజీల వరకు తీసుకుంటున్నారు. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఇలా అయితే తమకు గిట్టుబాటు కాదంటున్నారు.
ఈ విషమమై ఏవో పవన్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కందులను కొనుగోలు చేయాలి. ఉన్నతాధికారుల అనుమతి రాగానే కందులను కొంటాం.
పురుగులు పడుతున్నాయి
రెండెకరాల్లో కంది సాగు చేశా. 6క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇళ్లలో నిల్వ చేసుకోవడం వల్ల పురుగులు పడుతున్నాయి. గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకే అమ్ముతున్నాము. - రవీంద్రనాయక్, రైతు, సూర్యతండా