వైసీపీ దొంగాటను ప్రజలు నమ్మరు
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:55 AM
యువత పోరు పేరుతో వైసీపీ మరో దొంగాటకు తెర తీసిందని, దాన్ని ప్రజలు నమ్మరని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ విమర్శించారు. బుధవారం మండలంలోని హుశేనాపురం గ్రామంలో వైసీపీ యువపోరు పేరుతో నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని ఆయన ఖండించారు

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్
ఓర్వకల్లు మార్చి 12, (ఆంధ్రజ్యోతి): యువత పోరు పేరుతో వైసీపీ మరో దొంగాటకు తెర తీసిందని, దాన్ని ప్రజలు నమ్మరని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ విమర్శించారు. బుధవారం మండలంలోని హుశేనాపురం గ్రామంలో వైసీపీ యువపోరు పేరుతో నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని ఆయన ఖండించారు. హుశేనాపురంలో మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు యువత భవిష్యత్తును సర్వనాశనం చేసి పోరుబాట సాగిస్తే ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. ఐదేళ్లలో వైసీపీకి గుర్తుకురాని ఫీజు రీయంబర్స్‌మెంటు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు.
రూ.4.271 కోట్లు ఫీజు రీయంబర్స్‌మెంటు వసతి దీవెన బకాయిలు పెట్టింది జగన్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. 2014-19లో చంద్రబాబు ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తే.. జగన్ ప్రభుత్వం కుదించి 9 లక్షల మందికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి అన్యాయం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, కేవీ మధు, రాము, జీకే సుధాకర్, కాటినేని నారాయణ, గువ్వ రవికుమార్, బజారు, జయకృష్ణ, నారాయణ, రామగోవిందు, వేణు, రజాక్ పాల్గొన్నారు.