Share News

చైన్‌ స్నాచర్ల అరెస్ట్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:30 AM

పలు గొలుసు దొంగతనం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న దూదే కుల షహీద్‌ వలి, పింజరి దస్తగిరిలను నంద్యాల పట్టణంలోని ఆర్‌కే పంక్షన్‌ హాల్‌వద్ద ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

చైన్‌ స్నాచర్ల అరెస్ట్‌
నిందితులను చూపుతున్న ఎస్పీ అదిరాజ్‌సింగ్‌ రాణా

నంద్యాల టౌన్‌ ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): పలు గొలుసు దొంగతనం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న దూదే కుల షహీద్‌ వలి, పింజరి దస్తగిరిలను నంద్యాల పట్టణంలోని ఆర్‌కే పంక్షన్‌ హాల్‌వద్ద ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్‌ సింగ్‌ రాణా వివరాలు తెలిపారు. వీరి వద్ద నుంచి 4 తులాల తాళిబొట్టు బంగారు గొలుసు, 2.3 బంగారు గొలుసు, హోండా సైన్‌ బైక్‌ స్వాదీనం చే సుకున్నట్లు తెలిపారు. వీరు గతంలో కూడా పలు గొలుసు దొంగతనం కేసుల్లో ఉన్నారని జైలుకు కూడా వె ళ్లి వచ్చినట్లు తెలిపారు. సీఐ సుధాకర్‌రెడ్డి, సురేశ్‌కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నిందితుడి అరెస్టు

నంద్యాల టౌన్‌ ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): నంద్యాల, గుంటూరు జిల్లాల్లో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన దోపిడీలు, బందిపోటు దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న మేకల హనుమంతును అరెస్టు చేసినట్లు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రెండు జిల్లాలో పలు దొంగతనాలు, దారి దోపిడీ కేసుల్లో నిందితుడైన హనుమంతు పాములపాడు మండలం వేంపేంట గ్రామం జగన్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. సోమవారం పాణ్యం వద్ద జంబులమ్మ ఆర్చీ గుడి వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 5 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.12వేల నగదు స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐలు కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేశ్‌కుమార్‌, ఎస్సై నరేంద్ర కుమార్‌రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:31 AM