Share News

పత్తి అధరహో..

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:27 AM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో మంగళవారం పత్తి ధరలు భారీగా పెరిగాయి. క్వింటం పత్తి గరిష్టంగా రూ.8021 చేరుకుంది.

పత్తి అధరహో..
విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడి

క్వింటం రూ. 8021

ఆదోని అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో మంగళవారం పత్తి ధరలు భారీగా పెరిగాయి. క్వింటం పత్తి గరిష్టంగా రూ.8021 చేరుకుంది. ఈ సీజన్‌లో ఇదే రికార్డు స్థాయి ధర. పత్తి ధరలు మళ్లీ పుంచుకోవడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 90శాతంపైగా చిన్న, సన్నకారు రైతులు ఇప్పటికే వచ్చిన ధరకు అమ్ముకున్నారు. గత వారంతో పోల్చితే పత్తి ధర క్వింటానికి రూ.200పైగా ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది పత్తి గింజల ధరలు పెరగడంతో స్థానిక మార్కెట్‌లో పత్తి ధరలు పెరిగాయని కాటన్‌ మర్చెంట్‌ అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. 988 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా కనిష్ఠ ధర రూ.4250, గరిష్ఠ ధర రూ.8021, మధ్య ధర రూ.7525 పలికింది.

Updated Date - Apr 16 , 2025 | 12:27 AM