Share News

పేద ఆర్య వైశ్యులను ఆదుకుంటాం

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:41 AM

పేద ఆర్యవైశ్యులను ఆదుకుంటామని న్యాయ, మైనార్టీ శాఖమంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శనివారం నంద్యాల అమ్మవారిశాలలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బింగుమళ్ల శ్యామ్‌సుందర్‌ గుప్త ప్రమాణ స్వీకారం చేశారు.

పేద ఆర్య వైశ్యులను ఆదుకుంటాం
ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్యామ్‌సుందర్‌ గుప్త

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా శ్యామ్‌సుందర్‌ గుప్త ప్రమాణం

నంద్యాల కల్చరల్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): పేద ఆర్యవైశ్యులను ఆదుకుంటామని న్యాయ, మైనార్టీ శాఖమంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శనివారం నంద్యాల అమ్మవారిశాలలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బింగుమళ్ల శ్యామ్‌సుందర్‌ గుప్త ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులకు కార్పొరేషన్‌ రుణాల కోసం తనవంతు తోడ్పాటు అందిస్తానన్నారు. ఉమ్మడి జిల్లాల ఎన్నికల అధికారి, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వీరబొమ్మ నాగసత్యనారాయణ శ్యామ్‌సుందర్‌ గుప్తతో ప్రమాణ స్వీకారం చేయించారు. అతిథులుగా జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు కండే శ్యామ్‌సుందర్‌లాల్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పువ్వాడి భాస్కర్‌, యువజన సంఘం అధ్యక్షుడు ధనుంజయ, జిల్లా మాజీ అధ్యక్షులు భవనాశి నాగ మహేష్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ శ్రీధర్‌ హాజరయ్యారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు బింగుమళ్ల సుబ్బలక్ష్మయ్య, రామశేషు, నెరవాటి సత్యనారాయణ, ఖండే ఆనంద్‌, బనగానపల్లె, ఆత్మకూరు, నందికొట్కూరు, శిరివెళ్ల, వెలుగోడు, బేతంచెర్ల, కొలనుభారతి, ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 12:41 AM