Minister Savita : బీసీల ద్రోహి జగన్: మంత్రి సవిత
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:56 AM
‘‘బీసీలు అంటేనే టీడీపీ.. టీడీపీ అంటేనే బీసీలు.’’ అని మంత్రి సవిత అన్నారు.

Minister Savita : ‘‘బీసీలు అంటేనే టీడీపీ.. టీడీపీ అంటేనే బీసీలు.’’ అని మంత్రి సవిత అన్నారు. మండలిలో బీసీల సంక్షేమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బీసీలతో ఓటు వేయించుకుని గత వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం రూ.896.71 కోట్లు విడుదల చేశామన్నారు. రూ.250 కోట్లతో లక్ష మంది మహిళలకు టైలరింగ్ శిక్షణతోపాటు కుట్టుమిషన్లను ఉచితంగా ఇవ్వబోతున్నట్టు తెలిపారు. గతప్రభుత్వం చేనేతలను మోసం చేసిందని, జగన్.. నేతన్న ద్రోహి అని మంత్రి మండిపడ్డారు.