Share News

వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:39 AM

చేజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిం చినా కొనుగోళ్లలో వేగవంతం లేదని, దీంతో గ్రా మంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నా యని, అందువల్ల ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు కోరారు.

వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

జేసీకి చేజర్ల రైతుల వినతి

ఒంగోలు(రూరల్‌), ఏప్రిల్‌3(ఆంధ్రజ్యోతి): చేజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిం చినా కొనుగోళ్లలో వేగవంతం లేదని, దీంతో గ్రా మంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నా యని, అందువల్ల ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈమేరకు గురువా రం ఒంగోలులో జేసీ గోపాలకృష్ణను కలిసి విన తిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ చేజర్ల ఎత్తిపోతల పథకం కింద 600 ఎకరాలలో వరిపంట సాగు చేయ గా ఇప్పడు ధాన్యం ఇంటికి చేరిందన్నారు. గ్రా మంలో 70నుంచి 80లారీల ధాన్యం నిల్వ ఉం దని, వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. ఇటీవల చేజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారని, కానీ ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. రోజుకు ఒక లారీ ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఇంత కొనుగోలుకు ఎంత సమయం పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే రైస్‌మిల్లర్‌లను ఎ క్కువ మందితో కొనుగోలు చేయించాలని కోరా రు. అకాల వర్షం పడతే ఆరుబయట గల ధా న్యం తడిసి పోయో ప్రమాదం ఉందని ఆవే దన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరా వు, రైతులు గద్దె వెంకటకృష్ణ, చేజర్ల శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Apr 04 , 2025 | 12:39 AM