Share News

రోడ్డు ప్రమాదంలో చెన్నైవాసి మృతి

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:05 AM

జరజాం జంక్షన్‌ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్ర మాదంలో తమిళనాడు రాష్ట్రం చెన్నైకు సమీపంలోని అవడి చిన్మమ్మన్‌ కోవెలవీధి చెందిన వ్యక్తి మృతి చెం దాడు.

రోడ్డు ప్రమాదంలో చెన్నైవాసి మృతి

ఎచ్చెర్ల, మార్చి 14(ఆంధ్రజ్యోతి): జరజాం జంక్షన్‌ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్ర మాదంలో తమిళనాడు రాష్ట్రం చెన్నైకు సమీపంలోని అవడి చిన్మమ్మన్‌ కోవెలవీధి చెందిన వ్యక్తి మృతి చెం దాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న బి.ఆకాష్‌(35) శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తుండగా.. జరజాం జంక్ష న్‌కు సమీపంలో ముందువెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ వె నుక భాగంలో కారు ఇరుక్కుపోగా.. కొంత దూరం లాక్కొనిపోయింది. డ్రైవ్‌ చేస్తున్న ఆకాష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఇరుక్కుపోయిన ఆకా ష్‌ను పోలీసులు బయటకు తీసి శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సమాచారాన్ని మృతుని కుటుంబ సభ్యులకు తెలియ జేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెన్నైలో ఇస్కలపాలెం మత్స్యకారుడు..

సోంపేట, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఇస్కలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు సీరాపు శ్యామ సుందర్‌(38) చెన్నైలో మృతిచెందాడు. బంధువులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు మేరకు.. చెన్నైలో చేపల వేటకోసం వెళ్లిన శ్యామసుందర్‌.. వేట సాగి స్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయాడు. సంక్రాంతికి వచ్చిన ఆయన నెల రోజుల కిందటే చెన్నై వెళ్లాడు. శ్యామసుందర్‌కి భార్య భానుమతి, కు మారుడు కుమారస్వామి ఉన్నారు.

విద్యుదాఘాతంతో యువకుడు..

జలుమూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): తలతరియా పంచాయతీ ఎర్రన్నపేట గ్రామానికి చెందిన బలగ మణికంఠ(19) విద్యుదాఘాతంతో శుక్రవారం మృతి చెందినట్టు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు. గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యుత్‌ దీపాలు అలంకరణ చేస్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో మణికంఠ మృతిచెందారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రలు లచ్చన్న, కుమారి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి..

రణస్థలం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదరిపై కోష్ఠ జంక్షన్‌ వద్ద గురువారం సాయంత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొని మృతి చెందాడు. జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి చెప్పిన వివరాల మేరకు.. గత కొంత కాలంగా మతిసరిగ్గా లేని ఆ వ్యక్తి కోష్ఠ జంక్షన్‌లో తిరిగేవాడని, గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో గాయపడగా.. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించిగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

పొందూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌..

పొందూరు, మార్చి 14(ఆంద్రజ్యోతి): మండల కేం ద్రం పొందూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపా ల్‌ సీహెచ్‌ ఉదయలక్ష్మి(53) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. ఏలూరులోని తన ఇంట్లో ఉండగా గుం డెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తర లించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారిం చారు. ఐదు రోజుల కిందట కళాశాలలో ఉండగా స్పృ హతప్పి పడిపోవడంతో సిబ్బంది పొందూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విశ్రాంతి తీసుకునేందుకు స్వ గ్రామానికి వెళ్లారు. కాగా ఉదయలక్ష్మి అధ్యాపకురాలిగా జోన్‌-2లో పనిచేస్తూ ప్రిన్సిపాల్‌గా పదోన్నతిపై గతేడాది మార్చిలో ఇక్కడికి వచ్చారు. ప్రిన్సిపాల్‌ మృతిపై ఎమ్మెల్యే కూన రవికుమార్‌, టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మో హన్‌, సర్పంచ్‌ లక్ష్మి, అధ్యాపకులు, సిబ్బంది సంతాపం తెలిపారు.

పురుగుల మందు తాగి యువకుడు..

నందిగాం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఆనందపురం సమీప ఊరచెరువు వద్ద వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన ఇచ్ఛాపురం హరికృష్ణ(24) అనే యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకు న్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతగిరికి చెందిన హరికృష్ణ నందిగాం మండలం ఆనందపురం చెరువు గట్టుకు చేరుకుని పురుగుల మం దు తాగి చనిపోతున్నానంటూ తన స్నేహితుడికి గురువారం సాయంత్రం ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని హరికృష్ణ బంధువులకు ఆ స్నేహితుడు తెలియజేయడంతో అక్కడకు చేరుకున్నారు. అపస్మారక స్థితి లో ఉన్న హరికృష్ణను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తర లించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 15 , 2025 | 12:05 AM