జనసంద్రంగా వంశధార తీరం
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:09 AM
మేజరు పంచా యతీ హిరమండలంలోని సుభలయి మెట్టపై వెలసిన వేంక టేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో శుక్రవారం ఘనంగా జరిగాయి.

ఘనంగా వేంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానం
హిరమండలం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): మేజరు పంచా యతీ హిరమండలంలోని సుభలయి మెట్టపై వెలసిన వేంక టేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో శుక్రవారం ఘనంగా జరిగాయి. మూడు రోజులపాటు నిర్వహించిన డోలోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆఖరి ఘ ట్టమైన చక్రతీర్థ స్నానాలకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో వంశధార నదీ తీరం జనసంద్రంగా మారింది. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి ఉత్సవ విగ్ర హాలను గరుడ వాహనంపై ఊరేగింపుగా తీసుకువెళ్లి నదిలో చక్ర తీర్థస్నానం చేయించారు. ఆలయ కమిటీ సభ్యులు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్‌ఐ ఎండీ యాసిన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
శ్రీముఖలింగేశ్వరునికి..
జలుమూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): డోలోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీముఖలింగేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు వంశధార నదిలో త్రిశూల పుణ్యస్నానాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. శివపార్వతులు ఉత్సవ విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ ఈవో ప్రభాకరరావు, అర్చకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
రట్టిలో భక్తజన హోరు
హరిపురం మార్చి 14(ఆంధ్రజ్యో తి): మందస మండలం రట్టిలో గత ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న వల్లభనారాయణ స్వామి డోలోత్సవాల్లో చివరి రోజు శుక్రవారం భక్త జనహోరుతో.. వల్లభనారయణ నామస్మరణతో మారుమోగింది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొ క్కులు చెల్లించుకున్నారు. ఈవో వాసుదేవరావు ఆధ్వర్యంలో స్వామి తిరువీఽధి నిర్వ హించారు. స్వామివారికి ఎంతో ప్రీతికర మైన మట్టి కలిశ పానకం స్వామివారికి సమర్పిం చారు. అధిక సంఖ్యలో సముద్ర స్నానాలు చేశారు. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పోలీ సులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టడంతో ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి.