Share News

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:05 AM

ప్రజా ఫిర్యాదుల నమో దు, పరిష్కారంలో జా ప్యం చేయొద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీ సు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసంలో వివిధ సమస్యలపై జిల్లా నలుమూల ల నుంచి 81 వినతులు అందాయి.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • గ్రీవెన్స్‌లో 81 వినతులు స్వీకరణ

శ్రీకాకుళం క్రెం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల నమో దు, పరిష్కారంలో జా ప్యం చేయొద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీ సు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసంలో వివిధ సమస్యలపై జిల్లా నలుమూల ల నుంచి 81 వినతులు అందాయి. ఈ వినతు లను ఎస్పీ పరిశీలించి బాధితులతో ముఖాము ఖి మాట్లాడారు. సకాలంలో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ల ఇన్‌చార్జిలను ఆదేశించారు. అలాగే వరం చారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో సో మవారం చలువ కళ్లద్దాలు, క్యాప్‌లు జిల్లా పోలీసు కార్యా లయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చేతుల మీదుగా ట్రా ఫిక్‌ పోలీసులకు అందజేశారు. కంచిలి మండలం కేశరప డ గ్రామానికి చెందిన కొరికాన నవీన్‌ తల్లి క్యాన్సర్‌తో బాధపడుతుండడంతో ఎస్పీ సూచనల మేరకు డా.రెడ్డీస్‌ లేబరేటరీస్‌ ఉద్యోగులు స్పందించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీ దుగా పరిశ్రమ ఉద్యోగలు సమకూర్చిన రూ.లక్షను నవీన్‌కు అందజేశారు. డీఎస్పీ వివేకానంద, ఎస్బీ సీఐ ఇమ్మాన్యుయేల్‌ రాజు, జేఆర్‌ పురం సీఐ ఎం.ఆవతారం తదితరులు పాల్గొన్నారు.

  • ‘నా కుమారుడి మృతిపై దర్యాప్తు చేయండి’

పొందూరు, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): తన కుమారుడు గొర్లె కన్నారావు మృతిపై అనుమానాలున్నాయని, దర్యాప్తు చేసి న్యాయం చేయాలని పొందూరు మండలం ఎరుకల కాలనీకి చెందిన గొర్లె శ్రీరాములు సోమవారం ఎస్పీ గ్రీ వెన్సులో ఫిర్యాదు చేశారు. తన కుమారుడిది ఆత్మహత్య కాదని కోడలు నాగలక్ష్మి, ఆమె తల్లిదండ్రులు సిద్దాబత్తుల లక్ష్మి, గురుమూర్తితో పాటు వారి బంధువులు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. గత నెల 10న కన్నారావు కొత్తూరు సర్కిల్‌ హిరమండలం సమీపంలో మృతిచెందా రు. తన కుమారుడి మృతిపై గత నెల 15న ఫిర్యాదు చేశామని, దీనిపై మార్చి 19న కొత్తూరు సీఐ మా కు టుంబాన్ని పిలిచి దర్యాప్తుచేసి న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు స్పందనలేదని ఫిర్యాదులో ఎస్పీకి మొర పెట్టుకున్నారు. న్యాయం జగరకపోతే న్యాయపోరాటం చేస్తామని శ్రీరాములు తెలిపారు.

  • మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు

  • జిల్లాలో 70మంది వాహనదారుల లైసెన్సుల రద్దు

  • మరో 60 రద్దుకు ప్రతిపాదనలు

  • ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): మద్యం తాగ వాహనం నడుపుతూ పట్టుబడిన వాహనచోదకుల లైసెన్స్‌లను చట్ట ప్రకారం రద్దు చేస్తామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు. ఇప్పటికే 70 మంది వాహనచోదకుల లైసెన్స్‌లు రద్దు చేశామని, మరో 60 మంది లైసెన్స్‌లు రద్దుకు జిల్లా రవాణా శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పింపించామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి మద్యం తాగి వాహనా లు నడిపితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. నగరంలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ చర్యల్లో భాగంగా ద్విచక్రవాహనదారులు, ఆటోలు పార్కింగ్‌కు కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలు పార్కింగ్‌ చేయాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌, ,రైతుబజార్‌, ఏడురోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఆటోలు అధిక సంఖ్యలో రహదారి మార్గంలో నిలపొద్దన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే బాధ్యులుగా తల్లిదండ్రులు లేకుంటే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, లైసెన్స్‌ కలిగి ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని ఎస్పీ సూచించారు. నిబంధనల ప్రకారం నెంబర్‌ ప్లేట్లు అమర్చాల ని, సైలెన్‌సర్లు మార్పు చేసి సౌండ్‌ పొల్యూషన్‌ చేయవద్దని, ఆటో డ్రైవర్లు రికార్డులు సక్రమంగా కలిగి ఉండాలన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:05 AM