HOLI: మదినిండుగా రంగులమయం
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:03 AM
colourful festival రంగుల పండుగ హోలీని జిల్లావాసులు ఆనందోత్సాహాలతో శుక్రవారం చేసుకున్నారు.

ఘనంగా హోలీ వేడుకలు
శ్రీకాకుళం కల్చరల్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రంగుల పండుగ హోలీని జిల్లావాసులు ఆనందోత్సాహాలతో శుక్రవారం చేసుకున్నారు. మార్వాడీ యువత, మహిళలు, రంగులు ఉత్సాహంగా ఒకరిపై ఒకరు చల్లుకుని సందడి చేశారు. శ్రీకాకుళంలోని న్యూకాలనీ, గుడివీధి, హయాతీనగరం, రెల్లివీధి తదితర ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిలాబీలు, పకోడీలు, తినుబండారాలు పంచుకున్నారు. నృత్యాలు చేస్తూ.. రంగునీళ్లు చల్లుకుంటూ సందడి చేశారు.