Inter: ముగిసిన ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:19 AM
Intermediate exams ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 75 కేంద్రాల్లో ఈ నెల 3 నుంచి పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరం 22,789 మంది, ద్వితీయ సంవత్సరం 17,567 మంది విద్యార్థులకు గానూ మొత్తంగా 3,349 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు.

ఇంటిబాట పట్టిన హాస్టల్ విద్యార్థులు
నరసన్నపేట, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 75 కేంద్రాల్లో ఈ నెల 3 నుంచి పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరం 22,789 మంది, ద్వితీయ సంవత్సరం 17,567 మంది విద్యార్థులకు గానూ మొత్తంగా 3,349 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. శనివారం పరీక్షలు పూర్తికావడంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఉత్సాహంతో బయటకు వచ్చారు. తోటి స్నేహితులను కలుసుకున్నారు. రెండేళ్లు కలిసి చదువుకున్న స్నేహితులు దూరమవుతుండడంతో కొంతమంది నిట్టూర్పు చెందారు. సోషల్ వెల్ఫేర్ కళాశాలలో చదివే విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లాలో దుప్పలవలస, తామరాపల్లి, ఎచ్చెర్ల, నందిగాం, కంచిలి తదితర ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంసెట్‌కు ప్రత్యేక శిక్షణ ప్రభుత్వమే ఇవ్వాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే కొంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్, వైద్యవృత్తిలో ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవ్వాలని నిర్ణయించారు. కామర్స్ విద్యార్థులు సీఏ ఫౌండేషన్ కోర్సు పరీక్షలను సిద్ధమవుతున్నారు.