Share News

ఉల్లాసం.. ఉత్సాహం

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:16 AM

కుర్రకారు కేరింతలతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తింది. ఉత్సాహంగా ఉల్లాసంగా స్టెప్పులేస్తూ స్టేజీ దద్దరిల్లేలా చేశారు.

ఉల్లాసం.. ఉత్సాహం
ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

  • సందడిగా బీఆర్‌ఏయూ వార్షికోత్సవం

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): కుర్రకారు కేరింతలతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తింది. ఉత్సాహంగా ఉల్లాసంగా స్టెప్పులేస్తూ స్టేజీ దద్దరిల్లేలా చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ 17వ వార్షికోత్సవం శుక్రవారం సాయంత్రం సందడిగా సాగింది. వర్సిటీ క్రీడామైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొని సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వీసీ కేఆర్‌ రజని మాట్లాడుతూ.. యువత లక్ష్యాలను చేరుకునేందుకు వర్సిటీ ఒక వేదిక అని చెప్పారు. జీఎంఆర్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ లక్కీవర్మ మాట్లాడుతూ.. నిరంతర కృషి, విలువలతో కూడిన ప్రయాణం ఎన్నో విజయ శిఖరాలకు చేరుస్తుందన్నారు. వర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.సుజాత వర్సిటీ నివేదికను చదివి వినిపిం చారు. వర్సిటీ ప్రిన్సిపాల్స్‌ ఎస్‌.ఉదయభాస్కర్‌, ఎం.అనూరాధ, సీహెచ్‌ రాజశేఖరరావు, ప్రోగ్రాం కన్వీనర్‌, కల్చరల్‌ కోఆర్డినేటర్‌ పి.రవికుమార్‌, కె.ఉదయకిరణ్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Apr 12 , 2025 | 12:16 AM