Share News

suspicious circumstances అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:01 AM

suspicious circumstances మండలం లోని సంతవురిటి గ్రామా నికి చెందిన వివాహిత బాలబొమ్మ భవాని (21) మంగళవారం అనుమా నాస్పద స్థితిలో మృతి చెందింది.

 suspicious circumstances  అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ (ఇన్‌సెట్‌లో) భవాని (ఫైల్‌)

తొమ్మిది నెలల కిందట వివాహం

కుమార్తె మృతికి అత్తింటివారే కారణమని బంధువుల ఆరోపణ

జి.సిగడాం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): మండలం లోని సంతవురిటి గ్రామా నికి చెందిన వివాహిత బాలబొమ్మ భవాని (21) మంగళవారం అనుమా నాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథ నం మేరకు.. పాలఖం డ్యాం గ్రామానికి చెందిన దారబోయిన భవాని, సంతవురిటి గ్రామానికి చెందిన సచివాలయం లైన్‌మెన్‌ బాలబొమ్మ దినేష్‌కు తోమ్మిది నెలల కిందట వివాహం జరిగింది. భవానీ, దినేష్‌ల మధ్య కొంత కాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భవాని మృతి చెందిందని ఆమె సోదరుడు నాగ రాజుకి దినేష్‌ పోన్‌ చేసి తెలియజేశాడు. దీంతో బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది. భవాని మెడపై గాయాలు ఉండడంతో తమ కుమార్తె మృతికి అల్లుడు దినేష్‌, అత్తింటి వారే కారణమని కుటుంబ సభ్యు లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం తెలు సుకున్న జేఆర్‌పురం సీఐ అవతారం, లావేరు ఎస్‌ఐ లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించిన అనంతరం దినేష్‌ని విచా రించి అదుపులోకి తీసుకున్నారు. భవాని తండ్రి దారబోయిన రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అవతారం తెలిపారు. రెవెన్యూ సిబ్బం ది ఆధ్వర్యంలో మృతదేహానికి శవపంచనామా చేసి, పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Updated Date - Apr 16 , 2025 | 12:01 AM