Share News

Chennai Meeting : చెన్నై భేటీకి టీడీపీ, జనసేన దూరం

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:44 AM

నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో డీఎంకే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన హాజరు కాలేదు.

Chennai Meeting : చెన్నై భేటీకి టీడీపీ, జనసేన దూరం

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో డీఎంకే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన హాజరు కాలేదు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మార్చి 12న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివా్‌సను తమిళనాడు మంత్రి ఈవీ వేలు ఆహ్వానించారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షంగా ఉన్నందున ఆ సమావేశానికి హాజరుకాలేమని అప్పుడే పల్లా స్పష్టం చేశారు. తనకు అందిన ఆహ్వానంపై జనసేన స్పందిస్తూ... వేర్వేరు కూటముల్లో ఉన్నందున హాజరుకాలేమని పేర్కొంది. ‘నియోజకవర్గాల పునర్విభజనపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఈ అంశంపై మా విధానం మాకు ఉంది. మా విధానాన్ని సాధికారిక వేదికపై వెల్లడిస్తాం’ అని జనసేనానికి రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 04:44 AM