దయారా బుగ్యాల్ శిఖరం అధిరోహణ
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:42 AM
స్థానిక సబ్ రిజిస్ట్రార్ బలగా గీతాలక్ష్మి హిమాలయాల్లో 11,830 అడుగుల ఎత్తులో ఉన్న దయరా బుగ్యాల్ శిఖరాన్ని అధిరోహించారు.

చోడవరం సబ్ రిజిస్ట్రార్ బలగ గీతాలక్ష్మి సరికొత్త సాహసం
చోడవరం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్ రిజిస్ట్రార్ బలగా గీతాలక్ష్మి హిమాలయాల్లో 11,830 అడుగుల ఎత్తులో ఉన్న దయరా బుగ్యాల్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శిఖరం అధిరోహణ కార్యక్రమంలో పాల్గొని ఆమె తిరిగి వచ్చారు. పర్వతారోహణపై అభిరుచి ఉన్న ఈమె ఇప్పటికే తూర్పుకనుమల్లో 5,540 అడుగుల ఎత్తైన జిందగఢ్ శిఖరంతోపాటు గత ఏడాది అక్టోబరులో హిమాలయాల్లో 12,110 అడుగుల ఎత్తైన చంద్రశిల శిఖరాన్ని అధిరోహించారు. ఈసారి పర్వతారోహణలో ఆమెతో పాటు, భర్త, పిల్లలు కూడా పాల్గొనడం విశేషం.