Inter Sudent Passed Away: షాకింగ్ న్యూస్.. పరీక్షల్లో తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:14 PM
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు విడుదలైన సంగతి తెలిసిందే. అందరి లాగానే చరణ్ అనే విద్యార్థి తన మార్కులను చూసుకున్నాడు. పరీక్షల్లో తప్పానని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

విశాఖ: చదువంటే ఉద్యోగం తెచ్చిపెట్టే సాధనం మాత్రమే. జీవితంలో ఎదిగి ఉన్నతంగా జీవించి కుటుంబసభ్యులను మంచిగా చూసుకునేందుకు విద్య ఉపయోగపడుతుంది. అయితే చదువు లేకుండా కూడా ఎంతో మంది ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించారు. నచ్చిన రంగాల్లో అడుగుపెట్టి తమను వెక్కిరించిన వారిని సైతం తలదించుకునేలా చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, అనుకునన్ని మార్కులు రాలేదనో జీవితాన్నే బలితీసుకోవాల్సిన అవసరం లేదు. చదువు అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. అందులో సక్సెస్ అవ్వకపోయినంత మాత్రాన జీవితమే వృథాగా భావించాల్సిన అవసరం లేదు. కష్టపడి చదివి మళ్లీ విజయం సాధించడమో లేదా నచ్చిన రంగం వైపు మళ్లడమో చేయాలి. అంతేకాని పరీక్షల్లో తప్పామని, నలుగురు ఏమనుకుంటారో అని ఆత్మనూన్యతా భావానికి గురికావొద్దు. నిండు ప్రాణాన్ని బలితీకోవద్దు. గోడకు కొట్టిన బంతిలా బలంగా తిరిగొచ్చి నువ్వేంటో చూపించాలి.
విశాఖ జిల్లా తగరపువలస గ్రామం కొండపేటకు చెందిన జి.చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇవాళ(శనివారం) ఉదయం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు విడుదలైన సంగతి తెలిసిందే. అందరు విద్యార్థుల లాగానే చరణ్ తన మార్కులను చూసుకున్నాడు. పరీక్షల్లో తప్పానని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. ఏం భయపడవద్దని, మళ్లీ పరీక్షలు రాయెుచ్చని ధైర్యం చెప్పారు. అనంతరం వారు పని మీద బయటకు వెళ్లగా చరణ్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తీవ్ర ఆవేదనకు గురైన చరణ్ ఫ్యాన్‌కి ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. కొనఊపిరితో ఉన్న చరణ్‌ను హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. కష్టపడి కన్నీపెంచిన కుమారుడు ఇక తిరిగిరాడని తెలిసి కన్నీటి పర్యంతం అవుతున్నారు.
మరోవైపు కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోనూ ఇదే తరహ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో శుక్రవారం నాడు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బండిఆత్మకూరు మండలం ఏ.కోడూరు గ్రామానికి చెందిన వెంకట సుదీశ్వరరెడ్డి అనే యువకుడు నంద్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే పరీక్షలు సరిగా రాయకపోవడంతో కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రోజు రిజల్స్ వస్తాయని తెలిసి భయపడ్డాడు. ఫెయిల్ అయ్యానని తెలిస్తే అందరూ తనను అవమానిస్తారని కుంగిపోయాడు. ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు త్వరగా తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయండి
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే
59 ఏళ్ల వయసులో చెట్టెక్కిన హీరో
Read Latest AP News And Telugu News