Share News

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Apr 12 , 2025 | 09:19 PM

విశాఖ-బెంగళూరు మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు. విశాఖ- బెంగళూరు రైలు ఆదివారం రోజున విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణం సోమవారం రోజున బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..
Special Trains

విశాఖ: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించినట్లు ప్రకటించింది. విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు, అలాగే కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వీటిని నడపనున్నట్లు వెల్లడించింది. విశాఖ, బెంగళూరు, తిరుపతి, కర్నూలు ప్రాంతాల మధ్య మొత్తం 42 వీక్లీ రైళ్లను నడిపేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్‌ 13 నుంచి మే నెలాఖరు వరకూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.


విశాఖ-బెంగళూరు మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు. విశాఖ- బెంగళూరు రైలు ఆదివారం రోజున విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణం సోమవారం రోజున బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ రైలు ఏలూరు, విజయవాడ, ఒంగోలు, దువ్వాడ, గూడురు, రేణిగుంట, జోలార్‌పేట్‌, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుందని చెప్పారు. అలాగే వీటిల్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయని వెల్లడించారు. 08581, 08582 నంబర్ గల రైళ్లు ఆయా స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.


విశాఖ- తిరుపతి మధ్య 14 రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే విశాఖపట్నం- తిరుపతి రైలు ప్రతి బుధవారం విశాఖ నుంచి తిరుగు ప్రయాణం గురువారం రోజున తిరుపతి నుంచి ఉంటుందని వెల్లడించారు. 08548, 08547 నంబర్ల గల రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇవి నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, కైకలూరు, గుడివాడ, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.


ఇక, విశాఖ-కర్నూలు సిటీ మధ్య మెుత్తం 14 రైళ్లు తిరుగుతాయని అధికారులు వెల్లడించారు. విశాఖ-కర్నూలు ప్రత్యేక రైలు విషయానికి వస్తే ప్రతి మంగళవారం రోజున విశాఖ నుంచి కర్నూలు సిటీకి అలాగే తిరుగు ప్రయాణం బుధవారం రోజున కర్నూలు నుంచి విశాఖకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. 08545, 08546 నంబర్ గల రైళ్లు విశాఖ-కర్నూలు మధ్య తిరుగుతాయని పేర్కొన్నారు. వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దువ్వాడ, నరసరావుపేట, దిగువమెట్ట, నంద్యాల, డోన్‌, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు సేషన్లలో రైళ్లు ఆగుతాయని వెల్లడించారు. మరోవైపు వీటిల్లోనూ 2ఏసీ, 3ఏసీ, జనరల్‌ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. రైళ్ల తేదీలు వెల్లడించినప్పటికీ, ఏ సమయానికి బయలుదేరుతాయనే విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఇంకా ప్రకటించలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

Noida Hotel Case: ఇద్దరూ ఏకాంతంగా గడిపారు.. యువతి బాత్ రూమ్ నుంచి వచ్చే సరికే..

Viral Video: లేడి ఎస్సైతో అలాంటి పనా.. నీకుందిలే అంటూ నెటిజన్లు ఫైర్..

Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..

Updated Date - Apr 12 , 2025 | 09:22 PM