Share News

యువత పోరులో కనిపించని విద్యార్థులు

ABN , Publish Date - Mar 13 , 2025 | 01:37 AM

వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘యువత పోరు’ కార్యక్రమంలో విద్యార్థులు ఒక్కరు కూడా కనిపించలేదు.

యువత పోరులో కనిపించని విద్యార్థులు

  • కంగుతిన్న వైసీపీ నేతలు

విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘యువత పోరు’ కార్యక్రమంలో విద్యార్థులు ఒక్కరు కూడా కనిపించలేదు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యా సంస్థల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని, దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వారికి అండగా నిలిచేందుకు యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. అయితే బుధవారం కలెక్టర్‌ వద్ద చేపట్టిన కార్యక్రమంలో విద్యార్థులు ఒక్కరు కూడా కనిపించకపోవడంతో ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. వైసీపీ నేతలకు చెందిన సంస్థల నుంచి రప్పించేందుకు యత్నించినప్పటికీ విద్యార్థులు విముఖత వ్యక్తంచేసినట్టు ఆ పార్టీ నేతలు కొందరు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నప్పుడు వారిని ముందుపెట్టి కార్యక్రమం నిర్వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తంచేశారు.

Updated Date - Mar 13 , 2025 | 01:37 AM