Share News

at last relief హమ్మయ్యా..

ABN , Publish Date - Mar 15 , 2025 | 11:53 PM

at last relief పగలనక రేయినక పుస్తకాలతో కుస్తీలు పట్టి.. టెన్షన్‌ టెన్షన్‌గా పరీక్షలకు బయలుదేరి.. ఏ జవాబుకు ఎన్ని మార్కులు వస్తాయో బేరీజు వేసుకుని.. ఈ హడావిడిలో అంతంతమాత్రంగా నిద్రాహారాలతో గడిపిన క్షణాల నుంచి వారికి స్వేచ్ఛ లభించినట్లయింది. హమ్మయ్యా అనుకున్నారు.

at last relief హమ్మయ్యా..

హమ్మయ్యా..

పరీక్షల చివరి రోజు ఆనందంగా కనిపించిన ఇంటర్‌ విద్యార్థులు

విజయనగరం కలెక్టరేట్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పగలనక రేయినక పుస్తకాలతో కుస్తీలు పట్టి.. టెన్షన్‌ టెన్షన్‌గా పరీక్షలకు బయలుదేరి.. ఏ జవాబుకు ఎన్ని మార్కులు వస్తాయో బేరీజు వేసుకుని.. ఈ హడావిడిలో అంతంతమాత్రంగా నిద్రాహారాలతో గడిపిన క్షణాల నుంచి వారికి స్వేచ్ఛ లభించినట్లయింది. హమ్మయ్యా అనుకున్నారు. ఇంటర్‌ పరీక్షల చివరి రోజు విద్యార్థులంతా కేరింతలు కొట్టారు. ద్వితీయ సంవత్సర పరీక్షలురాసిన వారంతా పరీక్ష సెంటర్‌ నుంచి బయటకు వస్తూనే ఆనందంగా కనిపించారు. స్నేహితులందరినీ కలుసుకుని కాసేపు మాట్లాడుకున్నారు. ఇంటికి వెళ్లేముందు గ్రూపు ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. కాగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు శనివారంతో ముగిశాయి. రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి చివరి రోజు కెమిస్ర్టీ, కామర్స్‌ సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. శనివారం 17383 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 16,922 మంది రాశారు. 461 మంది దూరంగా ఉన్నారు. ఈనెల ఒకటో తేదీన పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసింది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 66 కేంద్రాల్లో నిర్వహించారు. కేంద్రాలను ఆర్‌ఐవో, డెక్‌ మెంబర్లు తనిఖీ చేశారు.

-----------

Updated Date - Mar 15 , 2025 | 11:53 PM