గిరిజనులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:06 AM
ప్రభు త్వం గిరిజనులను అన్ని రకాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

అంబులెన్స్‌లు, గిరి బజార్ వాహనం ప్రారంభం
సాలూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం గిరిజనులను అన్ని రకాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. జిల్లాకు మంజురైన ఐదు అంబులె న్స్‌లు, గిరి బజార్ వాహనాన్ని పట్టణంలోని తన నివాసం వద్ద ఆమె శనివారం ప్రారంభిం చారు. అనంతరం ఆమె మాట్లాడారు. సంతల్లో కల్తీ సరుకుల అమ్మకాలు జరుగుతున్నట్టు గు ర్తించామని, గిరిజనులు వాటి బారిన పడకుం డా.. నాణ్యమైన సరుకులు పొందేందుకు గిరి బజార్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. గిరి బజార్‌లోని సామగ్రిని మంత్రితో పాటు ఐటీ డీఏ పీవో అశుతోష్ శ్రీవాస్తవ తోపాటు పలు వురు అధికారులు కొనుగోలు చేశారు. అనంత రం మంత్రి సాలూరు ఆశ్రమ బాలికల పాఠ శాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందించారు. పరీక్షలు బాగా రాయా లని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ పీడీ ఎం.సుధారాణి, సహాయ పీడీ వై.సత్యం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు, జిల్లా గ్రామీణాభి వృద్ధి సంస్థ పీడీ ఎం.సుధారాణి, జిల్లా వైద్యారో గ్యశాఖ అధి కారి కృష్ణవేణి, జీసీసీ మేనేజర్ మహేంద్ర, జి ల్లా శిశు సంక్షేమ అధికారి కనకదుర్గ పాల్గొన్నారు.
పార్వతీపురం, మార్చి 15 (ఆంధ్రజ్యో తి): పార్వతీపురం మన్యం జిల్లాకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) మూడు అంబులెన్స్‌లు అందించింది. ఈ అంబు లెన్స్‌లను సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి ప్రారంభించగా, పార్వతీపురంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో పార్వతీపురం ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఏ పీవో యశ్వంత్‌కు మార్‌రెడ్డి, ఎన్‌పీసీఐ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ రవికామత్, అసోసియే ట్ డైరెక్టర్ బీవీ ప్రసాద్ పాల్గొన్నారు.