Share News

పేదల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:16 AM

: పేదల సంక్షేమమే ధ్యేయమని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. నియోజకవర్గంలో వివిధ రుగ్మతలతో బాధపడుతూ సరైన వైద్యం పొందలేకపోతున్న 19 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.12.98 లక్షలు విడుదలయ్యాయి.

పేదల సంక్షేమమే ధ్యేయం
మార్లాపల్లి బాధితులకు ఆర్డర్‌ కాపీ అందజేస్తున్న కోళ్ల లలితకుమారి

లక్కవరపుకోట,మార్చి15(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే ధ్యేయమని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. నియోజకవర్గంలో వివిధ రుగ్మతలతో బాధపడుతూ సరైన వైద్యం పొందలేకపోతున్న 19 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.12.98 లక్షలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆయా బాధితులకు లక్కవరపుకోటలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి దంపతులు కేబీఏ రాంప్రసాద్‌ శనివారం ఆర్డర్‌ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమమే టీడీపీ అజెండా అని తెలిపారు. కార్పొరేట్‌ వైద్యం పొందలేని పేదలకు ముఖ్యమంత్రి అండగా ఉండి సహాయనిధి నుంచి నిధులు విడుదల చేస్తూ రోగులను ఆదుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్‌ పండ్‌ ఊసేలేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు రమణమూర్తి, చొక్కాకుల మల్లునాయుడు, లాలం అర్జునరావు, గొంప దుర్గా ఉమేష్‌, జీఎస్‌.నాయుడు, బంగారం రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:16 AM