Share News

గ్యాస్‌ ధర తగ్గించండి

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:02 AM

గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించాలని కోరుతూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.

గ్యాస్‌ ధర తగ్గించండి

బలిజిపేట, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించాలని కోరుతూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం నాయకుడు గేదెల సత్యనారాయణ, మండల నాయకుడు యమ్మల మన్మథ రావు తదితరులు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం: వంట గ్యాస్‌ సిలెండర్‌ ధరను కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.50 పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని కాంగ్రెస్‌ పార్టీ కురుపాం నియోజకర్గం కోఆర్డినేటర్‌ అడ్డాకుల చిన్నారావు మండిప డ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన గుమ్మలక్ష్మీపురం లో విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశన్ని అంటగా, గ్యాస్‌ ధరను కూడా పెంచడం ధారుణమన్నారు.

బొబ్బిలి రూరల్‌: పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం జె.రంగరాయపురం గ్రామంలో సీపీఎం మండల కన్వీనర్‌ ఎస్‌.గోపాల్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఎల్పిజీ సిలిండర్‌పై రూ.50 పెంచడం దారుణం అన్నారు. సీపీఎం మండల కార్యదర్శి రెడ్డి తిరునాథు, రెడ్డి తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.

బొబ్బిలి: వంటగ్యాస్‌ సిలెండర్ల ధరను రూ.50 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ బొబ్బిలి పట్టణంలోని 30వ వార్డులో సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. మహిళలంతా సిలెండర్లకు, మోదీకి దండాలు పెడుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.శంకరరావు, జి.శంకరరావు, పద్మ, గౌరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:02 AM