Share News

గడువులోగా సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:10 AM

సమస్యలను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, జాప్యం చేస్తే సహించబోమని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కరవేదికలో వచ్చిన అర్జీల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, పరిష్కారంలో అర్జీలు రీఓపెన్‌ కారాదని తెలిపారు.

గడువులోగా సమస్యలు పరిష్కరించండి
వినతులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌:

పార్వతీపురం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): సమస్యలను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, జాప్యం చేస్తే సహించబోమని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కరవేదికలో వచ్చిన అర్జీల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, పరిష్కారంలో అర్జీలు రీఓపెన్‌ కారాదని తెలిపారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టర్‌ కార్యాలయ సమావేశంలో జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌ కార్య క్రమం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోబిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు సుధారాణి అర్జీదారులు నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్‌ 110 మంది అరీ దారులు నుంచి వినతులను స్వీకరించి ముఖాముఖి మాట్లాడి సమ స్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పరిష్కారిస్తామని అర్జీదారులకు కలెక్టర్‌ భరోసా ఇచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నుంచి వచ్చిన వినతులను పరిష్క రించాలని, నాణ్యత ఉన్న ఎండార్స్‌మెంట్‌ అందజేయాలని అధికా రులను ఆదేశించారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు.

ఆక్రమణపై చర్య తీసుకోండి

కొత్తవలసలో సర్వేనెంబర్‌ 202 విస్తీర్ణంలో ఏలో 34.90 సెంట్లకు గాను గత భ్రుత్వంలో మూడెకరాల కబ్జాకు గురైందని పార్వతీపురం మునిసిపాలిటీలోని ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ నారాయణరావు తెలిపారు.ఈ మేరకు వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువైతే పంట పొలాలు మునిగి రైతులకు నష్టం కలుగుతుండడంతో ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తహశీల్దార్‌కు ఆదేశించారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 56 వినతులు

సీతంపేట రూరల్‌,ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): కోతాం, జి.గుమ్మడ, కు మ్మరిగుంట గ్రామాల్లో అంతర్గత సీసీ రహదారులు నిర్మించాలని గిరి జనులు కోరారు. ఈమేరకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డిని కోరారు. సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను 56వినతులు వచ్చాయి. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు,డీడీ అన్నదొర, పీహెచ్‌వో వెంకటగణేష్‌, టీడబ్ల్యు డీఈ సింహాచలం,ఆర్‌డబ్ల్యేఎస్‌ డీఈ మధు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:10 AM