మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి సర్వే
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:18 AM
మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక యాప్ ద్వారా ఎన్యుమరేటర్ల ద్వారా సర్వే చేపట్టినట్లు సెర్ప్ రాష్ట్ర అదనపు సీఈవో కె.శ్రీరాములునాయుడు తెలిపారు.

పాచిపెంట, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక యాప్ ద్వారా ఎన్యుమరేటర్ల ద్వారా సర్వే చేపట్టినట్లు సెర్ప్ రాష్ట్ర అదనపు సీఈవో కె.శ్రీరాములునాయుడు తెలిపారు. శనివారం మండలంలోని అమ్మవలసలో ఎన్యుమరేటర్లు గంగమ్మ గ్రామ సం ఘం పరిధిలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ రాష్ట్రంలో 1.50 లక్షల ఎన్యుమరేట్లను నియమించి సర్వే నిర ్వహిస్తున్నా రని చెప్పారు. వార్షిక అప్పులు, జీవనోపాధి, ప్రణాళికలపై యాప్ ద్వారా సర్వే చేస్తున్నారని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు గ్రూపుగా ఏర్పడి ఆదా యం వచ్చే యాక్టివిటి నిర్వహిస్తే అధిక ఆదాయం వస్తుందని, ఆ విధంగా ఆలోచించాలని కోరారు. ప్రస్తుతం స్త్రీనిధి పథకంలో తీసుకున్న రుణాలకు 0.90 శాతం వడ్డీ పడగా, ఆ వడ్డీని 0.70 శాతానికి తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.కార్య క్రమంలో మన్యం జిల్లా డీఆర్‌డీఏ పీడీ సుధారా ణి, ఇన్‌చార్జి ఏసీ శివుడునాయుడు, రామకృష్ణ, కె.భాస్కరరావు పాల్గొన్నారు.
ఎన్యుమరేటర్లతో సర్వే
మక్కువ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెం దాలని సెర్ఫ్ రాష్ట్ర అదనపు సీఈవో కె.శ్రీరాములునాయుడు పిలుపునిచ్చా రు.శనివారం మండలంలోని చెముడులో సెర్ఫ్ ఆధ్వర్యంలో జరు గుతున్న సర్వేనుపరిశీలించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వార్షిక అప్పులు, జీవనోపాధి ప్రణాళికపై ప్రత్యేక యాప్ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 50 వేల మంది ఎన్యుమరేటర్లను ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నారన్నారు. మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తేనే కుటుంబాలు ప్రశాంత వాతావ రణంలో జీవనం సాగిస్తాయన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, ఏసీ శివున్నాయుడు పాల్గొన్నారు.
సర్వే వేగవంతంగా పూర్తి చేయాలి
పార్వతీపురం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా మహిళలకు రుణాలు అందించేందుకు రుణ ప్రణాళిక సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సెర్ప్ రాష్ట్ర అదనపు సీఈవో రెడ్డి శ్రీరామనాయుడు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శనివారం సీతానగరం మండలం చిన్నరాయుడుపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వ హించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఆర్థికగా అభివృద్ధి చెందాలని కోరారు.