16న కాల్వల మూసివేత
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:58 AM
ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు నీటిని తీసు కుని వెళ్లే డెల్టా కాలువలను ఈ నెల 16న మూసివేయనున్నారు.

రాజమహేంద్రవరం/భీమవరం టౌన్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు నీటిని తీసు కుని వెళ్లే డెల్టా కాలువలను ఈ నెల 16న మూసివేయనున్నారు. ఏటా సమ్మర్‌లో క్లోజ ర్ సమయం కింద కాల్వలకు నీటి సరఫరా ను నిలిపివేసి, కాల్వల్లో సిల్ట్, తూడు తొలగిం పు, ఇతర అభివృద్ధి పనులు చేస్తుంటారు. రబీ ముగిసిన తర్వాత, మంచినీటి అవసరా లకు నీటిని ఇచ్చి మూసేస్తుంటారు. తిరిగి జూన్ 1న తెరిచే అవకాశం ఉంది. ఈ ఏడా ది రబీలో శివారు, మెరక ప్రాంతాలలో కొంత వరకూ నీటిఎద్దడి ఎదురైంది. వంతుల వారీ విధానం పాటించడం వల్ల పెద్దగా సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. కాని శివారు ప్రాంతాల్లోని కొన్నిచోట్ల నీటి సమస్య ఎదురైంది. సాధారణంగా రబీ సీజన్‌తోపాటు మంచినీటి అవసరాలు, చెరువుల కోసం 120 టీఎంసీల వరకూ అంచనా వేస్తారు. ఇప్పటి వరకూ 103 టీఎంసీలు నీటిని వాడారు. 11,300 క్యూసెక్కుల నీటిని ఒక టీఎంసీగా పరిగణిస్తారు. మరో పది రోజులపాటు కాల్వ లకు నీరు ఇస్తారు కాబట్టి, ఈలోపు పంట అవసరాలు, మంచినీటి అవసరాలు, చేపల చెరువులకు అవసరమైన నీటిని వినియో గించుకోవాలి. ఇదే విషయాన్ని జిల్లా కలెక్ట ర్లు, జేసీలు సంబంధిత అధికారులకు స్ప ష్టం చేశారు. ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ పరిఽధిలో తూర్పు డెల్టాలో 2,64,533 ఎకరా లు,సెంట్రల్ డెల్టాలో లక్షా 72 వేల ఎకరాలు, పశ్చిమ డెల్టాలో నాలుగు లక్షల 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీ సీజన్ డిసెం బర్‌లో మొదలైంది. పూర్తిగా నాట్లు పడేసరికి జనవరి దాటేసింది. ఈ నేపథ్యంలో కొంత నీటి సమస్య ఉంది. వాస్తవానికి నవంబరు 1న రబీ సీజన్ మొదలయ్యేటట్టు ప్లానింగ్ ఉంటే రబీకి నీటి సమస్య ఉండదు. ప్రస్తు తం సీలేరు నుంచి ఎనిమిది వేల క్యూసె క్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం తూర్పు డెల్టాకు మూడు వేల క్యూసెక్కులు, సెంట్ర ల్ డెల్టాకు రెండు వేల క్యూసెక్కులు, పశ్చి మ డెల్టాకు 5,300 క్యూసెక్కుల నీటిని వదు లుతున్నారు. పోలవరం స్పిల్‌వే వద్ద సుమారు 20 టీఎంసీల వరకూ నీరు ఉన్న ట్టు చెబుతున్నారు. దీనితో ఈ సీజన్‌కు పెద్ద గా నీటి సమస్య ఉండదని ఇరిగేషన్ ఎస్ ఈ కె.గోపీనాథ్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారే జీ నీటిమట్టం ప్రస్తుతం 9.5 అడుగు లు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 6.05 అడుగులు మాత్రమే ఉంది. గత ఏడాదికంటే బాగుంది. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి 4114 టీఎంసీలు సముద్రం పాలైంది.