పేదలకు అండగా..
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:47 AM
స్వయం ఉపాధి కల్పనకు బీజం పడింది. వివిధ సామాజిక వర్గాల కార్పొరేషన్లను అప్రమత్తం చేసింది. ఆయా కార్పొరేషన్లలో ఇప్పటికే భారీ కదలిక వచ్చింది.

స్వయం ఉపాధి పేరిట ప్రభుత్వ ప్రోత్సాహం
వివిధ కార్పొరేషన్లలో భారీ కదలిక
ఉపాధి కోసం వేలాది దరఖాస్తులు
ఐదేళ్ల విరామం అనంతరం మళ్లీ కళకళ
ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ఒత్తిళ్లు
బ్యాంకర్లు సహకరిస్తేనే అనుకున్న లక్ష్యం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ఒకప్పుడు స్వయం ఉపాధి కల్పనకు వీలుగా తెలుగు దేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పేద వర్గాలు నిలదొక్కుకు నేందుకు వీలుగా అర్హులైన వారిని గుర్తించి వారికి రుణకల్పన చేసేలా బ్యాంకర్లను ప్రోత్సహించేది. కాని గడిచిన ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంలో కార్పొరేషన్లన్నీ దాదాపు నిర్వీర్యమయ్యాయి. పేద వర్గాలకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చే అవకాశాలున్నా ఆ దిశగా చూడనేలేదు. తెలుగుదేశం ప్రభు త్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావొస్తుంది. ఒక్కొ పథకం తెర ముందుకు వస్తోంది. పేదవర్గాలను కాస్తంత ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకు ముందు అమలు చేసిన ఆదరణ స్థాయిలో స్వయం ఉపాధి కల్పనకు బీజం పడింది. వివిధ సామాజిక వర్గాల కార్పొరేషన్లను అప్రమత్తం చేసింది. ఆయా కార్పొరేషన్లలో ఇప్పటికే భారీ కదలిక వచ్చింది. బ్రాహ్మణ, క్షత్రియ కమ్మ, రెడ్డి, కాపు, వైశ్య, బీసీ, ఈబీసీ కార్పొరేషన్ల న్నింటికీ జీవం పోసేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. ఆయా కార్పొరేషన్ల పరిధిలో పేద వర్గాలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా గత నెలలో రూపొందించిన ప్రణాళిక దాదాపు అక్కరకు వస్తోంది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారంతా పెద్ద ఎత్తున స్వయం ఉపాధి దరఖాస్తులు చేసి అధి కారుల ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. సరాసరిన రూ.లక్షన్నర నుంచి రూ.ఐదు లక్షల వరకు రుణం లభించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూ పొందించింది. జిల్లా పరిధిలో 30 వేలకు పైగా వివిధ పథకాల కింద దరఖాస్తులు అందాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలో 77 స్కీంలు అతి తక్కువగా ఉన్నాయి. అత్య ధికంగా బీసీ కార్పొరేషన్‌లో 20 వేలకు పైగానే ఉన్నాయి. 2014–19 మధ్య తెలుగు దేశం అధికారంలో ఉండగా అప్పట్లో ఆదరణ పథకం కింద వివిధ కుల వృత్తుల వారికి రుణ సదుపాయం అందించే దిశగా ప్రణా ళిక అమలు చేసింది.
బ్యాంకర్ల సాయమే కీలకం
ప్రభుత్వ పథకాలు అమలులోకి రావాలంటే అదీ స్వయం ఉపాధి కల్పనకు అంటే బ్యాంకర్ల్లు సాయ పడా ల్సిందే. ఇప్పటికే దరఖాస్తులు ప్రతీ బ్యాంకు పరిధి లోనూ భారీగా వచ్చిపడ్డాయి. గతంలో రుణం పొందిన వారిలో అత్యధికులు సకాలంలో ఇన్‌స్టాల్‌మెంట్ (వాయి దా) సొమ్ములు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు వసూళ్ల కోసం ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలకు చెంది న వారికి స్వయం ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసు కుంటున్నందున కొంతలో కొంతైనా రుణ సదుపాయం కల్పించకుంటే లక్ష్యం కాస్తా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకు లన్నీ ప్రభుత్వ లక్ష్యం మేరకు కొంత రుణ సదుపాయం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా బ్రోకర్లు రంగ ప్రవేశం చేసి రుణాలు ఇప్పిస్తాం.. మా వాటాగా 15 నుంచి 20 శాతం వచ్చిన రుణంలో చెల్లిం చాల్సిందేననే షరతు పెడుతున్నట్టు సమాచారం.
ఎమ్మెల్యేలకు చేతినిండా పని..
వివిధ కార్పొరేషన్లలో దరఖాస్తుల ప్రక్రియతోపాటు అర్హులను గుర్తించే పని వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఒత్తిడి పడుతోంది. తమకు రుణం వచ్చేలా, తాము ఎంపిక య్యేలా చూడాల్సిందిగా ఎమ్మెల్యేలపై స్థానిక నేతల ద్వారా లబ్ధిదారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఎమ్మె ల్యేలు కాస్త మేము చెప్పిన వారి సంగతి చూడా లంటూ అధికారు లకు విజ్ఞప్తి చేస్తున్నారు.