Share News

హంతకులకు జీవిత ఖైదు

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:39 AM

పక్షవాతంతో మంచంలో పడి ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ఆపై అత్యాచారం చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించారు.

హంతకులకు జీవిత ఖైదు
పోలీస్‌ టీమ్‌ను అభినందిస్తున్న ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి

వృద్ధురాలిపై అత్యాచారం, హత్య

సహకరించిన మరొకరికి ఐదేళ్ల జైలు

బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్ట ప్రకారం రాష్ట్రంలో మొదటి తీర్పు

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): పక్షవాతంతో మంచంలో పడి ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ఆపై అత్యాచారం చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించారు. తీవ్ర గాయాలకు గురైన ఆమె ఆసుపత్రిలో నెల రోజులపాటు చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ నేరానికి పాల్పడిన ఇద్దరిపై నేరం రుజువు కావడంతో అత్యాచారం చేసిన కేసులో ఒకొక్కరికి జీవితఖైదు, రూ.5 వేల జరిమానా, హత్య కేసు లో ఒకొక్కరికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమా నా, అపహరించిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడానికి సహకరించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఏలూరులోని మహిళా కోర్టు న్యాయాధికారి జి.రాజేశ్వరి సోమ వారం తీర్పు చెప్పారు. నేరం జరిగిన ఎనిమిది నెలల్లో బిఎన్‌ఎస్‌ఎస్‌ చట్ట ప్రకారం రాష్ట్రంలోని మొదటి తీర్పు ఏలూరులోని ఐదో అదనపు జిల్లా కోర్టులో సోమవారం వెల్లడించారు.

ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం పాలకొల్లు పట్టణంలోని ఒక వృద్ధురాలు (64) పక్షవాతంతో బాధపడుతూ కుమారె ్త వద్ద ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆ వృద్ధురాలిని ఉంచి సీసీ కెమెరా ఏర్పాటుచేసి ఒక ఆయాను కూడా నియమిం చారు. మొదటి అంతస్తులో ఆమె కుమార్తె, అల్లుడు, పిల్లలు ఉంటున్నారు. అల్లుడు బంగా రం వ్యాపారం చేస్తున్నారు. 2024 జూలై 29 మధ్యాహ్నం 2 గంటల సమయంలో వృద్ధురాలికి ఆయా భోజనం పెట్టిన అనంతరం మొదటి అంతస్తులో ఉన్న పిల్లలకు భోజనం పెట్టడానికి వెళ్లింది. అంతలో ఇద్దరు ఆగంతకులు వచ్చి ఆమెపై దాడిచేసి పక్కన ఉన్న ఇనుపరాడ్డు తీసుకుని ముఖాన్ని చితకబాదేశారు. పీక పిసికారు. ఆమె మెడలో బంగారు గొలుసు, చేతికి ఉన్న నాలుగు గాజులు తీసేసుకున్నారు. పక్కనే అల్మరాలో ఉన్న రూ.15 వేల నగదు, సెల్‌ఫోన్‌ తీసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న వృద్ధురా లిపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో వ్యక్తి ఆమె కాళ్లు చేతులు పట్టేసుకున్నాడు. ఇవన్నీ అక్కడ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అలికిడికి పైన ఉన్న వారు కిందికి వచ్చేసరికి వారిద్దరూ పారిపోయారు. బాధితురాలిని రాజమండ్రి, కాకినాడలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 2024 ఆగస్టు 29న మరణించింది. ఈ సంఘట నపై అప్పటి పాలకొల్లు టౌన్‌ సీఐ మంగాదేవి కేసు నమోదు చేశారు. తరువాత సీఐ కె రజనీ కుమార్‌ కేసు దర్యాప్తు చేశారు. ఈ నేరానికి పాల్పడిన పాత నేరస్తులు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని నారాయణపేటకు చెం దిన బొక్కా రాజు అలియాస్‌ రాజు, అలియాస్‌ ధనుష్‌, పాలకొల్లులోని సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయ సమీపంలో ఉంటున్న మీసాల మావుళ్లును అరెస్టు చేశారు. వారు అపహరించిన బంగారు ఆభరణాలను రాజమండ్రికి చెందిన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న పాతనేరస్తుడు రాజ మండ్రి సెంట్రల్‌ జైల్‌లో పరిచయమైన గుజ్జుల రామకృష్ణకు ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురిని సీఐ రజనీకుమార్‌ అరెస్టు చేశారు. ఈ కేసు ఏలూరు లోని జిల్లా మహిళా కోర్టు కం ఐదో అదనపు సెషన్స్‌ కోర్టులో విచారణ సాగింది. నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయాధికారి రాజే శ్వరి తీర్పు చెప్పారు. నిందితుల్లో బొక్కా రాజు, మీసాల మావుళ్లపై పలు కేసులు ఉన్నాయి. ప్రాసిక్యూషన్‌ తరపున ఏపీపీ డీవీ.రామాంజ నేయులు వాదించగా ప్రాసిక్యూషన్‌కు సీఐ మం గాదేవి, పాలకొల్లు టౌన్‌ సీఐ కె.రజనీకుమార్‌, కోర్టు కానిస్టేబుల్‌, ఎస్‌ మురళి, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌కుమార్‌ సహకరించారు. ఈ సందర్భంగా కేసు ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి అభినందించారు.

Updated Date - Apr 08 , 2025 | 12:39 AM