‘కారుమూరి’ వ్యాఖ్యలపై నాయకుల ఫైర్
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:48 AM
వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహనం కోల్పోయారు. ఆ పార్టీ అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఎర్రి పప్ప అని సంబోధించి.. దానికి బుజ్జి కన్నా అని కొత్త నిర్వచనం ఇచ్చారు.

ఏలూరురూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహనం కోల్పోయారు. ఆ పార్టీ అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఎర్రి పప్ప అని సంబోధించి.. దానికి బుజ్జి కన్నా అని కొత్త నిర్వచనం ఇచ్చారు. తాను ఓటమి పాలైనా ఇప్పుడూ నోరు పారేసుకున్నారు. ఏలూరులో మంగళవారం నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ నాయకులను వేధించిన టీడీపీ నాయకులను గుర్తు పెట్టుకుంటాం. గుంటూరు ఇవతల ఉన్న వాళ్లను ఇంట్లో నుంచి లాగికొడతారు. గుంటూరు అవతల ఉన్న వారిని నరికి పారేస్తారు’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీనిపై కూటమి నాయకులు అంతే ఘాటుగా స్పందించారు.
తణుకు: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వల్ల తమకు ప్రాణహాని ఉందని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవా రం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ మాట్లాడుతూ ఏలూరులో జరిగిన వైసీపీ కార్యక్రమంలో టీడీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలపై తక్ష ణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. మాజీ మంత్రిగా నియోజకవర్గంలో దోపిడీ ఏ మేరకు చేశారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు.
నోరు అదుపులో పెట్టుకో
8 రెడ్డి అప్పలనాయుడు హెచ్చరిక
ఏలూరురూరల్ : చట్టబద్దంగా పని చేస్తున్న పోలీసులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఇంట్లోంచి లాగేస్తాం.. నరికేస్తామంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేదిలేదని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. జగన్మోహన్‌రెడ్డి చేతనైతే తన చెల్లి, తల్లితోపాటు చిన్నాన్న కూతురు సునీత కన్నీళ్లు తుడవాలని, వారికి న్యాయం చేయాలని సూచించారు. చట్టబ ద్దంగా పనిచేస్తున్న పోలీసులను, ప్రభు త్వంపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే చర్యలు తప్పని హెచ్చరించారు. జగన్, కారుమూరి వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని కేసులు నమోదు చేయాలన్నారు.
సుమోటోగా కేసులు నమోదు చేయాలి : గన్ని
బుట్టాయగూడెం : రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైఎస్ జగన్మోహనరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలను సుమోటోగా కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం బుట్టాయగూడెంలో ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసుతో కలిసి విలేకరు లతో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్య మంత్రి జగన్ అసభ్యకరంగా మాట్లాడు తున్నారని, చనిపోయినవారిని ఓదార్పు పేరుతో పర్యటిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పర్యట నకు ప్రభుత్వం 1100 మంది పోలీసులతో భద్రత కల్పించినట్లు తెలిపారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు.
మా జోలికొస్తే.. తాటతీస్తాం
బొమ్మిడి నాయకర్ స్ర్టాంగ్ కౌంటర్
నరసాపురం : ‘ఒరేయ్ నా కొడకా.. కారుమూరి ఒళ్లు దగ్గర పెట్టుకో.. పద్ధతి మాట తీరు మార్చుకో.. కూటమి నాయకు లు, కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తామంటూ’ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏలూ రులో టీడీపీ నాయకులపై చేసిన వ్యాఖ్య లను ఖండిస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వ రంలో జరిగిన సభలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పద్ధతి, భాషా మార్చుకోవాలని లేకపోతే గుణపాఠం చెబుతా మని హెచ్చరించారు. మీ పాలనలో దాడు లు, పోలీస్ కేసులు భరించాం.. ఇప్పుడు కూడా ఇంకా అధికా రంలో ఉన్నట్లు వ్యవహరిస్తు న్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మీరు మాటతీరు మార్చుకోవాలి, లేకపోతే మీ నియోజకవర్గానికి వచ్చి మీ కార్యకర్తల ముందే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
పోలీస్టేషన్లలో ఫిర్యాదుల వెల్లువ..
తణుకు/ఏలూరు క్రైం : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై తణుకు నియోజకవర్గంలోని పలు పోలీ స్టేషన్లలో బుధవారం ఎస్సీ, బీసీ నాయకులు ఫిర్యాదు చేశారు. నరికేస్తామని, ఇంట్లోంచి లాగి కొడతా మంటూ చేసిన వ్యాఖ్యలు పట్ల ఆందోళనకరంగా ఉందని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, గుబ్బల శ్రీనివాసు, ఎస్సీల నుంచి చదవల వాడ నాని, అబ్బదాసరి లాజర్, రూరల్ పోలీసుస్టేషన్ పరిధి లో కొండేటి శివ, చుంచుల వెంకటేశ్వరావు, అత్తిలి స్టేషన్‌లో వరి శ్రీను, కడలి రామాంజనేయులు, ఆల్తి సత్యనారాయణ, నీతిపూడి శ్రీనివవాసు, మెంతే రాజకుమార్, ఇరగవరం మండలంలో చుక్కా సాయిబాబు, సోడే సంజీవ రావు, నాగేశ్వరరావు, రాంబాబు, గూడూరి నాగరాజు ఆయా స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఏలూరులో కారుమూరి, జేపీలపై ఫిర్యాదులు
టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏలూరులో వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి నాగేశ్వరరావు, ఏలూరు వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ మామిడిపల్లి జయ ప్రకాష్‌పై(జేపీ)లపై పోలీసులకు పలువురు ఫిర్యాదులు చేశారు. మామిడిపల్లి జయప్రకాష్ ఇదేవిధంగా వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరిపై టీడీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకుడు, మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరికొంతమంది టీడీపీ నాయకులు ఏలూరు టూ టౌన్, త్రీటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.