Banking Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన 7 ప్రధాన బ్యాంకింగ్ రూల్స్
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:38 PM
దేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి అనేక కొత్త బ్యాంకింగ్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. వీటి గురించి మీరు తెలుసుకోకుంటే ఇబ్బందులు పడతారు. ఈ క్రమంలో అమల్లోకి వచ్చిన బ్యాంకింగ్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ATM ఉపసంహరణ రుసుము, సేవింగ్ ఖాతా మినిమం బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు ప్రయోజనాలు, డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు సహా మరెన్నో విషయాలు ఉన్నాయి. ఈ కొత్త నియమాల గురించి మీరు తెలుసుకోవడం ద్వారా బ్యాంకింగ్ సేవలను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించుకోవచ్చు.
1. క్రెడిట్ కార్డ్ మార్పులు
ఏప్రిల్ నుంచి, SBI SimplyCLICK క్రెడిట్ కార్డ్ ఉపయోగించేవారు ఎప్పటికప్పుడు Swiggy రివార్డ్స్‌ను 5X పాయింట్లు పొందుతారు. కానీ ఈ రివార్డ్‌ల సంఖ్య ఇకపై సగానికి తగ్గిపోవచ్చు. అలాగే ఎయిర్ ఇండియా సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పాయింట్లు 30 నుంచి 10కి తగ్గాయి. IDFC First బ్యాంకు కూడా తన క్లబ్ విస్తారా పథకాన్ని నిలిపివేస్తోంది.
2. పాజిటివ్ పే సిస్టమ్ (PPS) అమలు
ఇప్పుడు చెక్కుల ద్వారా రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపినప్పుడు, పాజిటివ్ పే సిస్టమ్ (PPS) ప్రకారం చెక్కులు ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా, చెక్కును చెల్లించే ముందు, చెల్లింపుదారు జారీ చేసిన చెక్కుల పూర్తి వివరాలు బ్యాంకుకు అందజేయాలి. ఈ విధానం ద్వారా బ్యాంకుల మధ్య మోసాల నివారణకు సహాయపడుతుంది.
3. డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లు
డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత సురక్షితంగా అమలు చేసేందుకు రెండు రకాల ప్రామాణీకరణ (2FA), బయోమెట్రిక్ ధృవీకరణ వంటి భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేశారు. ఈ క్రమంలో AI ఆధారిత చాట్‌బాట్‌లను ఉపయోగించి బ్యాంకులు కస్టమర్లకు 24/7 సేవలు అందిస్తున్నాయి. దీంతోపాటు మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ల ద్వారా వినియోగదారులు తమ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించుకోవచ్చు.
4. పొదుపు ఖాతా, FD వడ్డీ రేట్లు
ఎన్‌ఎస్‌ఐ, HDFC వంటి బ్యాంకులు తమ FD (స్థిర డిపాజిట్) రేట్లను ఏప్రిల్ 1 నుంచి మార్చాయి. HDFC బ్యాంక్ 1 ఏప్రిల్ 2025 నుంచి సాధారణ పౌరుల కోసం తన FD రేట్లను సవరించింది. 21 నెలల కన్నా తక్కువకాల FDలపై 7.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ మార్పులు వినియోగదారులకు చాలా మేలు చేస్తాయి. అయితే పన్నుల పరంగా కూడా ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.
5. సేవింగ్ ఖాతా మినిమం బ్యాలెన్స్
సేవింగ్ ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ నియమాలను చాలా బ్యాంకులు సవరించాయి. ఈ మార్పు వల్ల, ఖాతాదారులు తాము నిర్వహించాల్సిన కనీస బ్యాలెన్స్ గురించి మరింత జాగ్రత్త వహించాలి. బ్యాంకుల ఖాతా రకం, బదిలీ ప్రాంతం (మెట్రో, అర్బన్, గ్రామీణ) వంటి విషయాల ఆధారంగా కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోతే ఆయా ఖాతాదారులపై జరిమానాలను బ్యాంకులు విధిస్తాయి.
6. ATM ఉపసంహరణ ఛార్జీలు
ఇప్పటి వరకు మనం ATMలలో ఉచితంగా వాడిన 5 లేదా 6 లావాదేవీల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచనల ప్రకారం, ప్రతి నెలకు ఇతర బ్యాంకు ATMలలో గరిష్టంగా మూడు ఉచిత ఉపసంహరణలు మాత్రమే అనుమతించబడతాయి. ఆ తర్వాత ప్రతి లావాదేవీపై రూ.20 నుంచి రూ. 25 వరకు ఛార్జీలు విధించబడతాయి. ఈ మార్పు వల్ల, వినియోగదారులు తమ ATM ఉపసంహరణలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
7. UPI లావాదేవీలు
గత 12 నెలలుగా వారి మొబల్ ఫోన్‌కు ఉపయోగించని UPI ఖాతాలను ఆయా బ్యాంకులు వారి రికార్డుల నుంచి తొలగించాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖాతాదారులు వారి UPI ఖాతాలను ఎప్పటికప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. ఈ మార్పు ద్వారా లావాదేవీల భద్రతా పెరిగి, మోసాలను అరికట్టవచ్చు.
ఇవి కూడా చదవండి:
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News