Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
ABN , Publish Date - Feb 22 , 2025 | 05:02 PM
ఇంకొన్ని రోజుల్లో మార్చి నెల రాబోతుంది. అయితే ఈ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మరికొన్ని రోజుల్లో ఫిబ్రవరి నెల పూర్తి కాబోతుంది. ఈ క్రమంలో వచ్చే మార్చిలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ సెలవుల్లో రెండో, నాల్గో శనివారాలతోపాటు ఆదివారం, ఇతర పండుగలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మార్చి 2025లో 13 రోజులు సెలవులు వచ్చాయి. మిగతా రోజుల్లో బ్యాంకులు పనిచేయనున్నాయి. కానీ ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి.
మార్చి 2025లో బ్యాంకు సెలవుల జాబితా
మార్చి 2, ఆదివారం - దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి
మార్చి 7, శుక్రవారం - చాప్చర్ కుట్ పండుగ సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు
మార్చి 9, రెండో శనివారం - నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి
మార్చి 13, గురువారం - హోలిక దహన్ సందర్భంగా డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువనంతపురంలలో బ్యాంకులకు హాలిడే
మార్చి 14, శుక్రవారం - హోలీ సందర్భంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోచ్చి, కోహిమా, ఇంఫాల్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 15, శనివారం - యావోసెంగ్ దినోత్సవం నేపథ్యంలో అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో బ్యాంకులకు హాలిడే
మార్చి 16, ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్
మార్చి 22, నాల్గో శనివారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 23, ఆదివారం - దేశంలో అన్ని బ్యాంకులు బంద్
మార్చి 27, గురువారం - షబ్-ఎ-ఖదర్ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు
మార్చి 28, శుక్రవారం - జమాత్ ఉల్ విదా నేపథ్యంలో జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులకు హాలిడే
మార్చి 30, ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
మార్చి 31, సోమవారం - రంజాన్ ఈద్ సందర్భంగా ఐజ్వాల్, సిమ్లా మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఈ సేవలు మాత్రం..
అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, వినియోగదారులు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ క్రమంలో యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలను ఫోన్ల ద్వారా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఏటీఎం కేంద్రాల నుంచి క్యాష్ విత్ డ్రా, డిపాజిట్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News