Share News

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:50 PM

మీరు సీనియర్ సిటిజన్ల కోసం మంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం చూస్తున్నారా. అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. ప్రస్తుతం ఏ బ్యాంకులో FD చేస్తే, మీకు ఎక్కువ వడ్డీ లభిస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..
Senior Citizens Guaranteed Returns

దేశంలో మనీ సేవింగ్ కోసం అనేక స్కీమ్స్ ఉన్నప్పటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) అత్యంత ప్రజాదరణ పొందినవని చెప్పవచ్చు. ఇవి సురక్షితమైనవి కావడంతో పాటు, గ్యారెంటీడ్ రిటర్న్స్ అందిస్తాయి. వీటిలో ఎలాంటి రిస్క్ ఉండదు. అనుకున్న సమయానికి వడ్డీతోపాటు ఎంత మొత్తం వస్తుందో ముందే అంచనా వేసుకోవచ్చు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లతోపాటు అనేక మంది వీటిపై మక్కువ చూపిస్తారు. అయితే ఎప్పటికప్పుడూ వీటిలో వడ్డీ రేట్లు మారుతుంటాయి. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లు లక్ష రూపాయలను ఏ బ్యాంకులో FD చేస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


SBI FD రేట్లు

ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 444 రోజుల FD పథకంపై 7.75% వడ్డీ రేటును అందిస్తున్నారు. ఈ క్రమంలో 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల FD ప్లాన్లపై SBI వరుసగా 7.30%, 7.25%, 7.50% వడ్డీ రేట్లను అందిస్తోంది.

SBI FD రాబడి

  • ఒక సంవత్సరం: రూ. 1,07,502

  • 3 సంవత్సరాలు: రూ. 1,24,055

  • 5 సంవత్సరాలు: రూ. 1,44,995


BoB FD రేట్లు

బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) సీనియర్ సిటిజన్లకు 400 రోజుల FD పథకంపై 7.80% వడ్డీ రేటును అందిస్తుంది. 1, 3, 5 సంవత్సరాల FD ప్లాన్లపై వరుసగా 7.35%, 7.65%, 7.40% వడ్డీ రేట్లు అందిస్తున్నారు.

BoB FD రాబడి

  • 1 సంవత్సరం: రూ. 1,07,555

  • 3 సంవత్సరాలు: రూ. 1,25,525

  • 5 సంవత్సరాలు: రూ. 1,44,285

PNB FD రేట్లు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సీనియర్ సిటిజన్లకు 400 రోజుల FD పథకంపై 7.75% వడ్డీ రేటును అందిస్తుంది. 1, 3, 5 సంవత్సరాల FD ప్లాన్లపై వరుసగా 7.30%, 7.50%, 7% వడ్డీ రేట్లను అందిస్తున్నారు.

PNB FD రాబడి

  • 1 సంవత్సరం: రూ. 1,07,502

  • 3 సంవత్సరాలు: రూ. 1,24,972

  • 5 సంవత్సరాలు: రూ. 1,41,478


Canara Bank FD రేట్లు

కెనరా బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 3 నుంచి 5 సంవత్సరాల FD పథకంపై 7.90% వడ్డీ రేటును అందిస్తుంది. అయితే 1, 3, 5 సంవత్సరాల FD ప్లాన్‌లపై 7.35%, 7.90%, 7.20% వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.

Canara Bank FD రాబడి

  • 1 సంవత్సరం: రూ. 1,07,555

  • 3 సంవత్సరాలు: రూ. 1,26,452

  • 5 సంవత్సరాలు: రూ. 1,42,875

ICICI Bank FD రేట్లు

ICICI బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ FD పథకంపై 7.80% వడ్డీ రేటును అందిస్తోంది. 1, 3, 5 సంవత్సరాల FD ప్లాన్‌లపై వరుసగా 7.20%, 7.50%, 7.50% వడ్డీ రేట్లు అమలు చేస్తుంది.

ICICI Bank FD రాబడి

  • 1 సంవత్సరం: రూ. 1,07,397

  • 3 సంవత్సరాలు: రూ. 1,24,972

  • 5 సంవత్సరాలు: రూ. 1,44,995


HDFC Bank FD రేట్లు

HDFC బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 4 సంవత్సరాలు 7 నెలల (55 నెలలు) FD పథకంపై 7.90% వడ్డీ రేటును అందిస్తుంది. ఇతర FD ప్లాన్స్ 1, 3, 5 సంవత్సరాలపై వరుసగా 7.10%, 7.50%, 7.50% వడ్డీ రేట్లను అందిస్తున్నారు.

HDFC Bank FD రాబడి

  • 1 సంవత్సరం: రూ. 1,07,291

  • 3 సంవత్సరాలు: రూ. 1,24,972

  • 5 సంవత్సరాలు: రూ. 1,44,995

Axis Bank FD రేట్లు

యాక్సిస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 15 నెలల నుంచి 2 సంవత్సరాల FD పథకంపై 7.75% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ క్రమంలో FD పథకాలపై 1, 3, 5 సంవత్సరాల FD ప్లాన్‌లపై వరుసగా 7.20%, 7.60%, 7.75% వడ్డీ రేట్లను అమలు చేస్తున్నారు.

Axis Bank FD రాబడి

  • 1 సంవత్సరం: రూ. 1,07,397

  • 3 సంవత్సరాలు: రూ. 1,25,340

  • 5 సంవత్సరాలు: రూ. 1,46,784

ఈ వడ్డీ రేట్ల ప్రకారం చూస్తే సీనియర్ సిటిజన్లకు ఐదేళ్లలో యాక్సిస్ బ్యాంకులో అత్యధికంగా వడ్డీ లభిస్తుంది. లక్ష రూపాయలు FD చేస్తే ఐదేళ్ల తర్వాత రూ. 1,46, 784 మొత్తం వస్తుంది.


ఇవి కూడా చదవండి:

New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 17 , 2025 | 04:09 PM