GST on Insurance: త్వరలో ఇన్స్యూరెన్స్‌పై జీఎస్టీ తగ్గనుందా..
ABN, Publish Date - Mar 17 , 2025 | 05:07 PM
GST on Insurance: త్వరలోనే ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై వసూలు చేస్తున్న జీఎస్టీ రేటు తగ్గబోతోందా.. వస్తే పాలసీదారులకు కలిగే ప్రయోజనాలేంటి.. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి దీని గురించి ఏమని చెప్పారు.

GST on Insurance: ప్రస్తుతం ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ప్రీమియం, జీఎస్టీ విడివిడిగా డబ్బు చెల్లించాల్సి వస్తుండటంతో పాలసీదారులు అదనపు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదే అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు ఖమ్మం ఎంపీ ఆర్.రఘురాం రెడ్డి. ఆయన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్ల సవరణలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GoM) కన్వీనర్ సామ్రాట్ చౌదరి సిఫార్సులు వెల్లడించారు.
ఇన్స్యూరెన్స్ ఉత్పత్తులపై ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఉంది. నిబంధనలకు అనుగుణంగా ప్రీమియంపై జీఎస్టీ విడిగా వసూలు చేస్తారు. ఈ రేటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన రాజ్యాంగబద్ధ సంస్థ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై వసూలు చేస్తున్న జీఎస్టీ రేట్లను సవరించేందుకు న్యూఢిల్లీలో 2024 సెప్టెంబర్ 9న జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GoM) ఏర్పాటైంది. దీనికి బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా ఉన్నారు.
2024 డిసెంబర్ 21న జైసల్మేర్ (రాజస్థాన్)లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మరో మారు ఈ అంశంపై చర్చ జరిగింది. లైఫ్,హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ రేట్ల సవరణల సిఫార్సులు రూపొందించేందుకు మరింత సమయం కావాలని GoM కన్వీనర్ సామ్రాట్ చౌదరి కోరారు. ఇందుకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించి మరింత సమయం మంజూరు చేసింది. అంటే GoM తన సిఫార్సులు, సూచనలు అందించిన తర్వాతే జీఎస్టీ కౌన్సిల్ ఒక నిర్ణయానికి. అంతవరకూ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఎలాంటి పన్ను ప్రయోజనాలు కలుగుతాయో చెప్పలేమని కేంద్ర సహాయ మంత్రి వెల్లడించారు.
Read Also : Vehicle Price Hike: షాకింగ్.. వచ్చే నెల నుంచి పెరగనున్న ఈ వాహనాల ధరలు
Gold Silver Rates Today: గుడ్ న్యూస్..రెండో రోజు కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు..
‘మెటల్ కింగ్’ అనిల్ అగర్వాల్
Updated Date - Mar 17 , 2025 | 05:11 PM