Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:00 PM
దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన వేళ ప్రధాన బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రతి నెలలో కూడా అనేక మంది పర్సనల్ లోన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ నెలలో ఉన్న ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రానే వచ్చేసింది. ఈ సందర్భంగా అనేక మంది పర్సనల్ లోన్స్ తీసుకునే వారు ఉంటారు. అయితే ప్రస్తుతం ఏప్రిల్ నెలలో ప్రధాన బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి బ్యాంకు లేదా బ్యాంకింగ్ సంస్థ (NBFC) తమ వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను నిర్దేశిస్తూ, వాటిని నెల నెలగా లేదా సంవత్సర వారీగా ఎప్పటికప్పుడు మారుస్తుంటాయి. ఈ వడ్డీ రేట్లు సాధారణంగా రుణగ్రహీత క్రెడిట్ స్కోర్, రుణం మొత్తం, బ్యాంకు లేదా NBFCతో ఉన్న సంబంధం ఆధారంగా మారుతుంటాయి. ఈ క్రమంలో మీరు బ్యాంకు లేదా బ్యాంకింగ్ సంస్థ నుంచి వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తున్నట్లయితే, వడ్డీ రేట్లు, రుణం ప్రాసెసింగ్ ఛార్జీల వంటి అనేక షరతుల గురించి ముందే తెలుసుకోవడం మంచిది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
దేశంలో అతి పెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకైన ఎస్బీఐలో ప్రస్తుతం పర్సనల్ లోన్స్ విషయంలో వార్షిక వడ్డీ రేటు 11.45%గా ఉంది. దీంతోపాటు 1.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేస్తారు. అయితే ప్రాసెసింగ్ ఫీజు ప్రతి బ్యాంకులకు ఒక్కో రకంగా మారుతుంటుంది.
HDFC బ్యాంక్:
HDFC బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటిగా ఉంది. ఈ బ్యాంకు ప్రస్తుతం జీతం ద్వారా తీసుకునే లోన్స్ విషయంలో వడ్డీ రేటు 10.90% నుంచి 24% వరకు వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీల పరంగా, ఈ బ్యాంక్ రూ.6,500 చొప్పున + GSTగా తీసుకుంటుంది. వడ్డీ రేటు క్లియరింగ్, రుణ అర్హత, రుణ అనుమతిని బట్టి మారుతుంది.
ICICI బ్యాంక్:
ICICI బ్యాంక్ కూడా ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రముఖ బ్యాంకు. ఈ బ్యాంకు వడ్డీ రేట్లు 10.85% నుంచి 16.65% మధ్య ఉంది. ఈ వడ్డీని ఖాతాదారులకు అనుకూలంగా అందిస్తాయి. ICICI బ్యాంక్ రుణం ప్రాసెసింగ్ ఛార్జీలుగా రుణ మొత్తంపై 2%, ఇతర పన్నులను వసూలు చేస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటిగా ఉంది. ఇది 10.99% నుంచి 16.99% మధ్య వడ్డీ రేట్లను వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు తుది రుణ మొత్తంలో 5%, ఇతర పన్నులు ఉంటాయి.
ఫెడరల్ బ్యాంక్:
ఈ బ్యాంకు 11.49% నుంచి 14.49% వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తుంది. ఇది సాధారణంగా ప్రతి రుణగ్రహీతకు అనుకూలంగా ఉంటుంది. ఫెడరల్ బ్యాంకు శ్రద్ధ చూపే అంశం రుణ గ్రహీత అభ్యర్థన, వారి క్రెడిట్ స్కోర్.
బ్యాంక్ ఆఫ్ బరోడా:
ఈ బ్యాంకు, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులతో ఉన్న సంబంధం ఉండే వారికి 13.05% నుంచి 15.30% వడ్డీ రేట్ల మధ్య వసూలు చేస్తుంది. జీతం పొందే రుణగ్రహీతల నుంచి తీసుకునే వడ్డీ రేటు ప్రత్యేకంగా ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా తమ వ్యక్తిగత రుణాలపై 11.50% నుంచి 15.20% మధ్య వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ఈ బ్యాంకు కూడా రుణగ్రహీతకు అనుకూలమైన సేవలను అందిస్తుందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Read More Business News and Latest Telugu News